రాముడి పై కేసు వేసిన లాయర్!!

A lawyer put case on God

06:15 PM ON 1st February, 2016 By Mirchi Vilas

A lawyer put case on God

దేవుడు పై కేసు వేశారు. అవును ఇది సినిమా లో కాదు నిజంగా జరిగిన సంఘటన. హింధువులు నిత్యం పూజించే ఆరాధ్య దైవం శ్రీ సీతారామలక్ష్మణులు. అలాంటి ఈ దేవుడు పై ఓ న్యాయవాది కేసు వేశాడు. సీతాదేవి ని శ్రీరామచంద్రుడు అడవులు పాలు చేసాడని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది ఈ పిటిషన్‌ పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాకు చెందిన ఠాకూర్‌ చందన్‌ సింగ్‌ అనే న్యాయవాది సీతాదేవి పై ఎవరో ఒక చాకలి వాడు నింద వేస్తే రాముడు ఏ మాత్రం ఆలోచించకుండా సీతను వనవాసానికి పంపించి ఆమెను కష్టపెట్టాడని సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఒక్క శ్రీరాముడు పైనే కాదు అన్నకు ఎదురు చెప్పకుండా ఆయన ఆదేశాలు పాటించి సీతను అడవి లో వదలి వచ్చినందుకు లక్ష్మణుడి పై కూడా ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే అంశాన్ని కోర్టు ఈ రోజు(సోమవారం) నిర్ణయిస్తుంది.

English summary

A lawyer put case on God. Yes it is true a lawyer who belongs to Bihar put case on lord SriRam and Lakshamana.