అమ్మాయి కాదందని ఆమె తల్లి పై కత్తితో దాడి.. ఆ పై..(వీడియో)

A lover attacks his lover's mother with knife

06:04 PM ON 4th June, 2016 By Mirchi Vilas

A lover attacks his lover's mother with knife

ప్రేమ త్యాగం కోరుకుంటుంది అంటారు. ప్రాణంగా ప్రేమించినా కొన్నిసార్లు కొన్ని కారణాలు వల్ల విడిపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రేమికులు త్యాగం చెయ్యడానికి కూడా వెనుకాడరు. ఇది ప్రేమలో ఉండే గొప్పతనం. అయితే, ప్రేమిస్తున్నానని చెప్పే కొందరు త్యాగం కాదు కదా.. కనీసం సంయమనంతో కూడా ఉండటం లేదు. తాము కోరుకున్న అమ్మాయి తనను కాదంటే మృగాళ్ళ మారిపోతున్నారు. కత్తులతో, యాసిడ్ తో దాడికి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మందమర్రికి చెందిన మర్రి రామకృష్ణ మృగంలా ప్రవర్తించాడు.

తానంటే ఇష్టంలేదని చెప్పిన అమ్మాయి ప్రాణాలు తీసేందకు ప్రయత్నించాడు.ఆమె తల్లి అడ్డు రావడంతో ఆమె పై సైతం కత్తితో దాడిచేశాడు. బాధితురాలి అమ్మమ్మ రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నింధితుడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


English summary

A lover attacks his lover's mother with knife