ప్రేమించానని చెప్తే భర్తకు విడాకులిచ్చి మరీ పెళ్లి చేసుకుంది.. ఆ తరువాత ఏం చేసాడో తెలుసా?

A lover cheats his wife after marriage

03:28 PM ON 19th July, 2016 By Mirchi Vilas

A lover cheats his wife after marriage

ప్రేమించానని చెప్తే భర్తకు విడాకులిచ్చి మరీ పెళ్లి చేసుకుంది.. ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆమెను మోసం చేసాడు. దీంతో న్యాయం చేయాలంటూ ఓ యువతి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలి వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ బాబూకాలనీకి చెందిన మస్తానీ(21)కి పులివెందులకు చెందిన ముస్కీనవలితో వివాహమైంది. కాగా, ఇదే కాలనీలో ఉన్న అతుల్ నాయక్(21) ప్రేమిస్తున్నానంటూ వెంట పడడంతో ఆమె ఒప్పుకుంది. దీంతో తనను వివాహం చేసుకోవాలని మస్తానీ కోరడంతో, భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని అతుల్ షరతు పెట్టాడు.

తాను చెప్పిన విధంగా ఆమె రావడంతో ఇద్దరూ ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే మూడేళ్లు కాపురం చేశాక.. పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయాలని మస్తానీ పట్టుబట్టింది. ఇదే విషయమై సోమవారం ఆమె గొడవకు దిగడంతో భర్త, అత్తామామలు ఆమెను ఇంటి బయటకు గెంటి వేసి.. ఆపై ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మస్తానీ సోమవారం అతుల్ ఇంటి ముందు నిరసనకు దిగింది. భర్త మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపింది.

English summary

A lover cheats his wife after marriage