గర్ల్ ఫ్రెండ్ కు అబార్షన్ చేయించడం కోసం ఆ లవర్ ఏం చేసాడో తెలుసా?

A lover turned as a thief for girlfriend abortion

12:14 PM ON 30th July, 2016 By Mirchi Vilas

A lover turned as a thief for girlfriend abortion

ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసే అబ్బాయిలని చూసి ఉంటాం.. అమ్మాయి అడిగితే ఏమైనా తెచ్చిచ్చే వాళ్ళని చూసి ఉంటాం.. అయితే ప్రేమించిన అమ్మాయికి కడుపు చేసి ఆ తరువాత అబార్షన్ చేయించడం కోసం ఆ లవర్ ఏం చేసాడో మనం చూసి ఉండం. అయితే ఇప్పుడు చూద్దాం.. తను చేసిన తప్పుడు పనిని చెరిపేయడానికి మరో తప్పుడు మార్గం ఎంచుకున్న యువకుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రేమించిన అమ్మాయికి అబార్షన్ చేయించడానికి అవసరమైన డబ్బుల కోసం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రోడ్లపై పార్క్ చేసిన బైకులను దొంగిలించాడు. ఆ క్రమంలో ఇటీవల పోలీసులకు చిక్కి స్నేహితులతో కలిసి జైల్లో కూర్చున్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చెందిన అమన్ పటేల్(20)కు 19 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ ఉంది. వారిద్దరూ హద్దు మీరి ప్రవర్తించడంతో ఆమె నెల తప్పింది. ఆమెకు మూడో నెల వచ్చిన తర్వాత విషయం బయటపడింది. అప్పుడు డబ్బులు లేకపోవడంతో గర్భస్రావం చేయించడం కుదరలేదు. అలా సమయం గడిచిపోయి ఐదోనెలకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా అబార్షన్ చేయించాలని డిసైడ్ అయ్యాడు అమన్. డాక్టర్ వద్దకు తీసుకెళ్తే ఇప్పుడు అబార్షన్ చేయడం రిస్క్ అని, డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని చెప్పాడు. దీంతో డబ్బుల సంపాదన కోసం మరో ఇద్దరు స్నేహితులు పవన్ కుమార్, అనురాగ్ శర్మతో కలసి దొంగతనాలు ప్రారంభించాడు. ఇటీవల బైక్ పోగొట్టుకున్న ఓ బాధితుడు పోలీసులకు వీరి గురించి సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఆ విచారణలో అమన్ ఈ విషయాలు వెల్లడించాడు. ఇది విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు.

English summary

A lover turned as a thief for girlfriend abortion