అశ్లీల చిత్రాలు పంపి ... ఊచలు లెక్కెడుతున్నాడు

A Man Arrested For Sneding Pornography Pictures

12:13 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

A Man Arrested For Sneding Pornography Pictures

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్నియోగం చేస్తూ, సోషల్ మీడియా ద్వారా మహిళకు అశ్లీల చిత్రాలు పంపిన ఓ ప్రభుద్దుడు ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నాడు. వివరాలలోకి వెళ్తే, సైబర్ క్రైం ఏసీపీ జయరాం కథనం ప్రకారం - ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ బెంగళూరులో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.ఓ మహిళ కూడా కొంత కాలం ఆ సంస్థలో పని చేసింది. కొద్ది రోజులుగా అనిల్‌కుమార్ ఆ మహిళలకు మొబైల్, ఇంటర్నెట్, ఫేజ్‌బుక్ ద్వారా అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. ఇక ఈ వేధింపులు తాళలేక సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఇంకేముంది పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితుడ్ని అరెస్టు చేశారు.

English summary

A man named Anil Kumar who belongs to Prakasham district was arrested by Cyberabad police for sending pornography pictures to a woman . Presently Anil Kumar Working in a one Private Company