దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై ఇనుపరాడ్ తో దాడి

A man attempted to attack on Raghavendra rao

10:44 AM ON 10th June, 2016 By Mirchi Vilas

A man attempted to attack on Raghavendra rao

ఈ మధ్య మానసిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో అనుకోని సంఘటనలు సమాజంలో ఎదురవుతున్నాయి. సహనం, ఓర్పు అనేవి తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా దాడులు పెరిగిపోతున్నాయి. అందుకు తార్కాణమే ఈ ఘటన. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుపై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన 28 ఏళ్ళ పీ.రవీంద్ర గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఫిలింనగర్ వెంచర్ -3లో నివసించే దర్శకేంద్రుని నివాసానికి వచ్చాడు. 2006లో వచ్చిన శ్రీరామదాసు మూవీ కథ తనదేనని, దానిని 2003లోనే మీకు పంపినా కథా రచయితగా తన పేరు పెట్టకుండా మోసం చేశారని అంటూ ఆయనను నిలదీశాడు. ఐతే ఈ మూవీ కథ జేజే భారవిదని, నీది కాదని రాఘవేంద్రరావు చెబుతుండగానే ఆయనను దూషించాడు. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని రవీంద్ర అంటుండగా రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.

ఆ తర్వాత రవీంద్ర ఓ ఇనుపరాడ్డు తీసుకొని రాఘవేంద్రరావు ఇంటిలోని మూడు కార్లను, ఇంటి అద్దాలను పగలగొట్టాడు. అడ్డు వచ్చిన వాచ్ మెన్ పై దాడి చేశారు. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశరావు బయటకు రాగా ఆయనపై కూడా దాడికి యత్నించాడు. ఇంతలో వాచ్ మెన్ వెనుకనుండి వచ్చి అతనిని పట్టుకున్నాడు. చివరకు ప్రకాశరావు, వాచ్ మెన్ కలిసి రవీంద్రను ఓ గదిలో పెట్టి బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు రవీంద్ర బుధవారం సాయంత్రమే రాఘవేంద్రరావు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎన్నో సినిమాలు తీసిన దర్శకేంద్రుని సినిమాల్లో కూడా లేని ఈ దృశ్యం నిజంగా రాఘవేంద్రరావును భయభ్రాంతులకు గురి చేసిందట.

ఇవి కూడా చదవండి:'బూబ్స్ బీర్' ఛాలెంజింగ్ గురించి విన్నారా(వీడియో)'

ఇవి కూడా చదవండి:ఇండియన్ అఫ్ ది ఇయర్' రేసులో రాజమౌళి ముందంజ

English summary

Tollywood Senior Director K.Raghavaendra rao was attacked by a young man named P.Ravindra from Ananthapur. He visited K.Raghavendra Rao's house and he used to say that the story of "Sri RamaDasu" movie was his story. He used to attack on Raghavendra Rao's Son and watch man and he broke up the cars glasses and later they caught him and filed a case on police station.