ఇంతకీ అతడు పోలీస్ ని ఎందుకు కొట్టాడు.. ఆపై పోలీసులు ఎందుకు చితక్కొట్టారు(వీడియో)

A man beats police in frustation

12:59 PM ON 17th November, 2016 By Mirchi Vilas

A man beats police in frustation

ఇప్పుడు కొన్ని విషయాల్లో మీడియా కన్నా సోషల్ మీడియా స్పీడుగా వుంది. తాజాగా అనంతపురం జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో తెగ తిరిగేస్తోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పోలీసులు చితక్కొట్టుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాళ్లు పోలీసులా? లేక రాక్షసులా? అంటూ మండిపడుతున్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటనపై ఓ ఛానల్ విచారణ జరిపింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం వివరాలలా వున్నాయి...

1/8 Pages

ఇంతకీ ఈ సంచలన ఘటన ఈనెల 12ఆదివారం ఉదయం అనంతపురం సాయినగర్ స్టేట్ బ్యాంక్ వద్ద జరిగింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలపడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్టేట్ బ్యాంక్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో టూటౌన్ సీఐ శుభకుమార్, ఆ స్టేషన్ ఎస్ఐలు క్రాంతికుమార్, జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. ఓ వైపు బ్యాంక్ వద్ద ప్రజల రద్దీ, మరోవైపు నిరసన నేపథ్యంలో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది.

English summary

A man beats police in frustation