మంచినీళ్లు కావాలని వచ్చి.. ఆపై రేప్!

A man came for a water and raped a woman

11:46 AM ON 5th November, 2016 By Mirchi Vilas

A man came for a water and raped a woman

మహిళలపై పైశాచికంగా లైంగిక దాడులకు తెగబడేవాళ్లు ఏరూపంలో ఎలా విరుచుకుపడతారో తెలీని దుస్థితి రాజ్యమేలుతోంది. తాజాగా జరిగిన సంఘటన చూస్తే, నిజంగా ఆందోళన కల్గుతుంది. మంచినీళ్ళు కావాలంటూ వచ్చిన ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. పశ్చిమబెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. భర్త నుంచి విడిపోయిన మహిళ ఓ వృద్ధురాలి వద్ద సహాయకురాలిగా ఉంటోంది. గురువారం రాత్రి ఆ ఇంటికి వచ్చిన ముగ్గురు యువకులు తాగడానికి మంచినీళ్ళు కావాలని అడిగారు. ఆమె లోపలికి వెళ్ళి నీరు తెచ్చేంతలో ఆ ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంట్లోవారిని భయపెట్టి ఆ మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.

English summary

A man came for a water and raped a woman