300 ఏళ్లనాటి రాజునంటూ భారీ మోసం..

A man cheated in China

01:05 PM ON 27th August, 2016 By Mirchi Vilas

A man cheated in China

ఈలోకంలో మాయగాళ్లు, మోసగాళ్లు అనేక రూపాల్లో వుంటున్నారు. ఎవరి పంధా వారిది. ఈ క్రమంలోనే బాబాల పేరుతో మోసం చేసిన వారి గురించి విన్నాం.. మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్దపెద్దవాళ్లు తెలుసంటూ డబ్బుకాజేసిన ఘటనలు చూశాం. కానీ వందల ఏళ్ల క్రితం దేశాన్ని పాలించిన రాజునంటూ, ఇంకా బతికే ఉన్నానంటూ మోసం చేయడం ఎక్కడైనా విన్నారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే జరిగింది చైనాలో. తాను 300ఏళ్ల నాటి రాజునంటూ.. ఓ సంపన్నురాలిని మోసం చేసి దాదాపు రూ.47 కోట్లు ఓ వ్యక్తి కాజేశాడంటే నమ్ముతారా కానీ ఇది జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

గువాన్ డాంగ్ ప్రావిన్స్ కు చెందిన జెంగ్ షుజు అనే మహిళ 2012లో ఓ వ్యాపారం ప్రారంభించింది. తన కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారిని ఆహ్వానించగా, వాన్ జియాన్ మిన్ అనే వ్యక్తి కలిశాడు. తాను ఫైనాన్షియర్ నని చెప్పి, కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నాడు. అంతా బానే ఉంది కానీ, కొన్ని రోజుల తర్వాత జెంగ్ కు వాన్ ఓ వ్యక్తిని స్నేహితుడంటూ పరిచయం చేశాడు. అతడి పేరు క్వియన్ లాంగ్. ఇంతకీ 1735 నుంచి 1796 వరకు చైనాను పాలించిన రాజు క్వియన్ లాంగ్. అయితే తానే ఆ రాజునని, 300ఏళ్లుగా బతికే ఉన్నానని వాన్ స్నేహితుడు జెంగ్ కు చెప్పాడు. అమృతం తీసుకోవడం వల్లే తాను ఇన్నేళ్లు బతికానని చెప్పుకొచ్చాడు.

English summary

A man cheated in China