'కిక్' కోసం వీడు ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

A man cheated like a police informer

11:10 AM ON 12th October, 2016 By Mirchi Vilas

A man cheated like a police informer

సినిమా ప్రభావం మనోళ్ళమీద బానే ఉంటుందనేదానికి ఈ తాజా ఘటన నిదర్శనం. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇస్తాడు. ఆ వెంటనే.. పోలీసులు వస్తున్నార్రోయ్ అని నేరగాళ్లకూ సమాచారం ఇస్తాడు. 'కిక్' సినిమాలో ఇలాంటోడ్ని చూసినట్లుందే అనుకుంటున్నారా? అక్కడ హీరో 'కిక్' కోసం ఇలా చేశాడు. కానీ, ఇక్కడ డబ్బుల కోసం డబుల్ గేమ్ ఆడాడు. పోలీస్ ఇన్ ఫార్మర్ అవతారం ఎత్తాడు. ఉద్యోగాల పేరిట మోసగించాడు. అమ్మాయిలను వేధించాడు. ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ మారువేషంలో వెళ్లి ఈ మాయగాడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసారు. మొత్తానికి పోలీసులు, నేరగాళ్లతో డబుల్ గేమ్ ఆడుతున్న ఓ మాయలోడిని వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

పోలీస్ ఇన్ ఫార్మర్ గా తనను తాను పరిచయం చేసుకుని ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం, అమ్మాయిల వెంటపడి ఆకతాయిగా వ్యవహరిస్తున్న ఈ యువకుడి పేరు మధుశేఖర్. కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన మధుశేఖర్ కృష్ణా పుష్కరాల్లో వలంటీర్ గా సేవలందించాడు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. వారితో సెల్ ఫోన్లో ఫోటోలు దిగి ఆ ఫోటోలను తన మిత్రులందరికి చూపించి తాను పోలీసు ఇన్ఫార్మర్ అని ప్రచారం చేసుకున్నాడు.

English summary

A man cheated like a police informer