మరదలితో సహజీవనం, మరో మహిళతో శృంగారం, బ్లాక్ మెయిల్

A man cheated two women

10:49 AM ON 1st April, 2016 By Mirchi Vilas

A man cheated two women

సమాజంలో విచ్చల విడిగా చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు జుగుప్స కలిగిస్తున్నాయి. సభ్య సమాజానికే తలవంపులు తెస్తున్నాయి. అయినా రోజూ ఎక్కడో అక్కడ, ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. ఇంక తాజాగా జరిగిన సంఘటన వింటే నోరు వెళ్ళబెట్టాల్సిందే... ఓ ప్రభుద్దుడు కట్టుకున్న భార్యకు స్వయానా చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు ఆ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెధిరింపులకు గురి చేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు.

ఇది కూడా చదవండి: బికినీలో హీటెక్కిస్తున్న 'సర్దార్' భామ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

అతని వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి. విజయవాడ పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే, కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు వివాహమైంది. కాగా, అతని భార్య చెల్లెలు అయిన శ్రీదేవి పై కన్నేసిన రవికాంత్ ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలెట్టాడు. ఈ క్రమంలో శ్రీదేవి తన భర్తకు విడాకులిచ్చి, అజిత్‌సింగ్‌నగర్ రామలింగేశ్వరపేటకు మకాం మార్చింది. రామలింగేశ్వనగర్‌లో నివాసం ఏర్పాటు చేసి శ్రీదేవితో రవికాంత్ సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఇంటికి సమీపంలో భర్త నుండి విడాకులు పొందిన మరో మహిళ(39) ఉంటోంది.

ఇది కూడా చదవండి: కుక్కని రేప్ చేసి ఆ పై...

ఈమెకు ఇద్దరు సంతానం, ఉన్నత చదువులు చదువుతున్నారు. సదరు మహిళ తన తండ్రి పెన్షన్‌తో జీవనం సాగిస్తోంది. కాగా, మోసపూరిత మాటలు చెప్పిన రవికాంత్.. ఆమెతో చనువు పెంచుకున్నాడు. సదరు మహిళతో గడిపిన శృంగార దృశ్యాల్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి మహిళను బ్లాక్‌మెయిల్ చేసి తనకు డబ్బులు అవసరమైనప్పడల్లా ఆ మహిళను బెధిరించడం మొదలు పెట్టాడు. దీంతో నిస్సహాయురాలైన మహిళ తన తండ్రి నుండి తీసుకున్న రూ. 6 లక్షల్ని రవికాంత్‌కు ఇచ్చింది. అనంతరం తనను వేధించవద్దని ఆమె వేడుకుంది. నిస్సహాయురాలైన ఆ మహిళ విడాకుల విషయాన్ని కూడా పక్కన పెట్టి తన భర్త చెంతకు చేరాలని ఆకాంక్షించింది.

ఆ విషయాన్ని ఏలాగో గ్రహించిన రవికాంత్... సదరు మహిళ నగ్న చిత్రాల్ని ఆమె భర్తకు చేరవేశాడు. దీంతో ఆమె కాపురం మరోసారి చిన్నాభిన్నమైంది. అన్ని వైపులనుంచి దారులు మూసుకుపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. చివరకు అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary

A man cheated two women. A man cheated his sister in law and another women and blackmails for money.