వామ్మో.. 332 కిలోల సమోసా, 14 గంటల్లో 12 మంది శ్రమించారు

A man created record with 332 kilos Samosa

11:37 AM ON 16th July, 2016 By Mirchi Vilas

A man created record with 332 kilos Samosa

ప్రతిఒక్కరు ఏదో ఓ రికార్డు సృష్టించడం, సృష్టించాలనుకోవడం సహజం. ఇది కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరికి సాయంత్రం వచ్చిందంటే టీ టైమ్ స్నాక్స్ తినడం, ముఖ్యంగా హాట్ హాట్ గా, కారంగా తయారు చేసుకొనే స్నాక్స్ తినడం అంటే మరింత ఇష్టం. అలాంటి వాటిలో సమోస ఒకటి. అసలు ఈ సమోసాకు ఢిల్లీ నుంచి గల్లీదాకా విపరీతమైన క్రేజ్ ఉంది. సమోసాకున్న ఆ క్రేజ్ ను ఇంకా రెట్టింపు చేయాలని ఓ కుర్రాడు భావించాడు. వెంటనే రంగంలోకి దిగాడు. ఫలితంగా మిగిలిన యువకులతో కల్సి 332 కిలోల భారీ సమోసాను తయారు చేసాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని అనే యువకుడు ఇంటర్ పూర్తిచేసి సొంత ఊరిలో చిన్న సమోసాల దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. తన సమోసాలకు విపరీతంగా గిరాకీ పెరగాలని అనుకున్నాడట. వెంటనే అతనికి పెద్ద సమోసా తయారు చేయాలనే ఐడియా తట్టింది. వెంటనే ఇందుకోసం 90 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాళ్ల గోధుమ పిండి, రెండు క్వింటాల బంగాళాదుంపలు ఉపయోగించి, 3 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల మందం కలిగిన 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు.

దీనిని తయారు చేసేందుకు 40 వేల రూపాయలు ఖర్చయ్యాయట. అసలు ఈ భారీ సమోసా తయారు చేసే ముందు, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసాడు. ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసాదే పెద్ద రికార్డని తెలిసింది. దానికంటే పెద్ద సమోసచేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలని రితేశ్ అనుకున్నాడు. అంతేకాదు చిన్నగా ఉన్న తన దుకాణం పెద్దగా మారాలని అనుకున్నాడు. పని మొదలుపెట్టాడు. 12 మంది స్నేహితులతో కలిసి భారీ సమోసా తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. అలా 14 గంటల్లో ఏకంగా 332 కేజీల సమోసా తయారుచేశాడు.

ఇక దీనిపై గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని, తమ సమోసా ప్రపంచంలోనే అతిపెద్ద సమోసగా గుర్తింపు పొందుతుందని రితేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సో రితేష్ కి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు.

English summary

A man created record with 332 kilos Samosa