10 గంటల పాటు రెప్పవేయకుండా సూర్యుణ్ణి చూసాడు

A man creates record by seeing Sun without blinking eyes

01:15 PM ON 20th August, 2016 By Mirchi Vilas

A man creates record by seeing Sun without blinking eyes

సూర్యుణ్ణి చూడాలంటే, ఆ కిరణాలకు కళ్ళు ఎలా అయిపోతాయి చెప్పలేం. ఎక్కువసేపు వీక్షిస్తే, కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. మొత్తం మీద ఉదయించే సూర్యభగవానున్ని కనురెప్పలు కొట్టకుండా ఒక్క క్షణమైనా చూడలేం. అయితే ఏకబిగిన పది గంటలపాటు కనురెప్పలు కొట్టకుండా సూర్య వీక్షణం చేసి, నెల్లూరు జిల్లాకు చెందిన యోగానందస్వామి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రమణమహర్షి ఆశ్రమంలో ఉన్న 42 అడుగుల మహాశివుడి భారీ విగ్రహం ఎదుట శుక్రవారం యోగానందస్వామి అలియాస్ సుధాకర్రెడ్డి(55) ఈ ప్రక్రియ చేపట్టారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కనురెప్పలు కొట్టకుండా ఏకబిగిన సూర్య వీక్షణం చేశారు. 27 రోజులపాటు కనురెప్పలు కొట్టకుండా సూర్యవీక్షణ యజ్ఞం చేపట్టనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఈ దృశ్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ యోగా సాధనతో 17 ఏళ్ల నుంచి కనురెప్పలు కొట్టకుండా సూర్యభగవానున్ని వీక్షిస్తున్నానని తెలిపారు. దేశంలో 16 రాష్ట్రాల్లోని ప్రముఖ హిందూదేవాలయాల్లో పది గంటల పాటు కనురెప్పలు కొట్టకుండా సూర్యుణ్ణి వీక్షించానని చెప్పారు. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించడమే తన ధ్యేయమని ఆయన తెలిపారు. మొత్తానికి ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలవారికి పాకింది.

English summary

A man creates record by seeing Sun without blinking eyes