ప్రేమించడంలేదని రెండు చేతులు నరికేశాడు

A man cuts her lover 2 hands for not loving him

10:38 AM ON 6th May, 2016 By Mirchi Vilas

A man cuts her lover 2 hands for not loving him

ప్రేమించడం లేదంటూ 30 ఏళ్ల వివాహితను దారుణంగా నరికి చంపాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామ్‌ఘర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోనాలీ ముర్ము(30)కు చిత్తరంజన్‌ తుడుతో వివాహమైంది. అయితే సోనాలీని తన స్కూల్ స్నేహితుడైన సుకేన్ మండల్(35) ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేసేవాడు. అయితే సుకేన్ ప్రేమను సోనాలీ తిరష్కరించింది. దీంతో పగ పెంచుకున్న సుకేన్ సోనాలీ టీచర్ గా పని చేస్తున్న బీఈడీ కళాశాలకు వద్దకు చేరుకుని దారుణంగా నరికి చంపాడు. అంతటి ఆగకుండా దారుణంగా రెండు చేతులను శరీరం నుంచి వేరు చేశాడు.

శరీరం పై 20 కత్తిపోట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోనాలీ భర్త మాట్లాడుతూ.. సుకేన్ నుంచి తన భార్య సోనాలీకి ప్రేమించాలని వేధింపులు వచ్చాయని పేర్కొన్నారు. తమను చంపేస్తామని కూడా బెధిరించాడని తెలిపారు. ఈ క్రమంలో సోనాలీ మొబైల్ నెంబర్ కూడా మార్చామని చెప్పారు. సుకేల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నాం కానీ లేనిపోని ప్రచారం జరుగుతుందని భయపడి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. తన భార్యను హత్య చేసిన సుకేల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

English summary

A man cuts her lover 2 hands for not loving him. A man killed her lover and cuts her 2 hands for not loving him.