ఉద్యోగం పీకేసారని విమానం ధ్వంసం చేశాడు(వీడియో)

A man destroyed a plane for losing his job

09:44 AM ON 30th April, 2016 By Mirchi Vilas

A man destroyed a plane for losing his job

సాధారణంగా ఏ ఉద్యోగి అయినా తనను ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కొంత నిరాశకు గురవుతాడు. ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం అన్వేషిస్తాడు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఉపాధి మీద దెబ్బ కొడితే అతనికి ఎక్కడో కాలింది.. అందుకే తన ఉద్యోగం పీకేసినందుకు సంస్థ పై పగ తీర్చుకున్నాడో మాజీ ఉద్యోగి... పైగా ఉద్యోగం నుంచి తొలగించిన కోపాన్ని ఆ వ్యక్తి సంస్థకు చెందిన విమానం పై చూపాడు. భారీ క్రేన్‌తో దాన్ని ధ్వంసం చేశాడు. ఆసక్తికరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన యుటి ఎయిర్లెన్స్ విమాన సంస్థ ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. దీంతో అతగాడు తన కోపాన్ని ఆ సంస్థ పైనే ప్రదర్శించాడు.

మిలియన్ డాలర్ల ఖరీదైన యుటి ఎయిర్లెన్స్ విమానాన్ని భారీ డిగ్గర్‌తో ముక్కలు చేసి తన కసి తీర్చుకున్నాడు. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి..

English summary

A man destroyed a plane for losing his job. A man destroyed a aeroplane with crane for losing his job.