యాక్సిడెంట్ కి దారితీసిన గేమ్

A man did accident while playing pokemon go game

04:46 PM ON 27th July, 2016 By Mirchi Vilas

A man did accident while playing pokemon go game

మొబైల్ గేమ్ లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈమధ్య కాలంలో ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న పోక్ మన్ గో గేమ్ మొట్టమొదటిసారి ఇండియాలో ఓ ప్రమాదానికి కారణమైంది. ముంబైలో తన మొబైల్ లో ఈ ఆట ఆడుతున్న 26 ఏళ్ళ జబ్బీర్ అలీ అనే కారు డీలర్ యాక్సిడెంట్ చేశాడు. బాంద్రా నుంచి తన మెర్సిడెస్ కారులో ఈ గేమ్ ఆడుతూ వెళ్తుండగా ఇతని కారును ఓ ఆటో ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో కారు ఓ గ్యారేజీలోకి దూసుకుపోయి బంపర్ దెబ్బ తిన్నదని జబ్బీర్ తెలిపాడు. తను గాయపడకుండా తప్పించుకున్నానని ఈ యువకుడు చెబుతున్నాడు.

కారు మరమ్మతులకు సుమారు 20 వేలు ఖర్చయిందని పేర్కొన్నాడు. నిజానికి తాను మొదటిసారి ఈ గేమ్ ఆడానని అంటున్నాడు. ఇక ఈ ఆట ఆడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని జబ్బీర్ సూచిస్తున్నాడు. అటు ముంబై పోలీసులు కూడా సిటీలో రోడ్లపై ఎవరూ దీన్ని ఆడరాదని హెచ్చరిస్తున్నారు. యూఎస్, జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికే ఈ గేమ్ మోజునపడి చాలామంది యాక్సిడెంట్లు చేశారట. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ గేమ్ లు ఆడడం వలన ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.

English summary

A man did accident while playing pokemon go game