సినిమా షూటింగ్‌ లో వ్యక్తి మృతి..

A man died in cinema shooting

06:00 PM ON 19th December, 2015 By Mirchi Vilas

A man died in cinema shooting

ఈ రోజు (శనివారం) హైదరాబాద్‌ లోని హయత్నగర్లో ఒక విషాదం చోటు చేసుకుంది. హీరో నాని నటిస్తున్న ఒక కొత్త చిత్రం షూటింగ్‌ రంగారెడ్డి జిల్లా లోని హయత్నగర్ మండలంలో జరుగుతుంది. అయితే ఆ షూటింగ్‌ చూడటానికి వచ్చిన వాళ్లలో తిరుపతి అనే వ్యక్తి అక్కడ కరెంట్‌ వైర్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన షూటింగ్‌ సిబ్బంది వెంటనే షూటింగ్‌ ఆపేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడ నుండి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.

English summary

A man died in Nani new film shooting in HayathNagar.