అన్నం ముద్దలు మింగే పోటీలో అతడికి ఏమైందంటే...

A man died in eating race

12:55 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

A man died in eating race

ఎన్నో రకాల పోటీలు పెట్టడం సహజం. ఇక తిండి విషయానికి వస్తే, ఇడ్లీ పోటీలు వంటివి చూస్తూనే ఉంటాం. అయితే జపాన్ లోని హికోన్ నగరంలో నవంబర్ 13న స్థానికంగా పండించే వరి అన్నం ముద్దల పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీలో ఐదు ముద్దలను ఎవరు ముందుగా మింగుతారో వారే విజేతలని నిబంధన పెట్టారు. అయితే మూడో రౌండ్ లో పాల్గొన్న ఓ యువకుడు త్వరత్వరగా ముద్దలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. జపాన్ లో ఇలాంటి తిండి పోటీలు సాధారణమే అయినా అతిగా, అతి వేగంగా తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary

A man died in eating race