ప్రాణం తీసిన ఫుడ్‌ ఎలర్జీ...

A man died in England for food poison

09:46 AM ON 11th May, 2016 By Mirchi Vilas

A man died in England for food poison

నట్‌ ఎలర్జీ ఉన్న వ్యక్తి ఓ రెస్టారెంట్‌ నుంచి కూర తెచ్చుకుని తిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంగ్లండ్‌లోని నార్త్‌యార్క్‌షైర్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ రెస్టారెంట్‌ యజమాని ఏకంగా హత్య కేసు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకెళ్తే.. నార్త్‌ యార్క్‌షైర్‌లో బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన మహమ్మద్‌ జమాన్‌ ఇండియన్‌ గార్డెన్‌ అనే రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. వేరుసెనగలు, జీడిపప్పు, బాదం తదితర గింజల ఎలర్జీ(నట్‌ ఎలర్జీ) ఉన్న పాల్‌ విల్సన్‌ రెస్టారెంట్‌ నుంచి కూర పార్సిల్‌ తీసుకెళ్లారు. అయితే ఆ కూర పల్లీలు, బాదం పొడి వేసి వండారు. దీంతో ఎలర్జీ ఉన్న అతడు ఈ కూర తిని ప్రాణాలు కోల్పోయారు.

ఇది 2014 జనవరిలో జరిగింది. ఈ కేసులో రెస్టారెంట్‌ యజమాని మహమ్మద్‌ జమాన్‌ పై హత్య, వినియోగదారుల ఆరోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం తదితర అభియోగాలు నమోదు చేశారు. 2016 మే 9న అతడి పై విచారణ ప్రారంభమైంది. విల్సన్‌ తీసుకున్న కూరలో పల్లీలు ఉన్నాయని.. వాటి వల్లే ఆయన ఎలర్జీతో చనిపోయినట్లు విచారణలో తేలింది. విల్సన్‌ రెస్టారెంట్‌లో తనకు నట్స్‌ లేని పదార్థాలు కావాలని అడిగినప్పటికీ అతడికి నిర్లక్ష్యంతో పల్లీలతో చేసిన కూర పార్సిల్‌ ఇచ్చారని జమాన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెస్టారెంట్‌లో సరైన నిబంధనలు పాటించడంలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేసి విచారిస్తున్నారు.

యజమాని జమాన్‌ మాత్రం తన పై ఆరోపణలను ఖండిస్తున్నారు. కోర్టులో విచారణకు మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary

A man died in England for food poison. A person in England has food elergy with nuts. But a restaurant provided that nuts to him. Beacuase of that he died.