సంజీవిని తెస్తూ హనుమంతుడు కన్నుమూత... ఎలానో తెలిస్తే షాకౌతారు(వీడియో)

A man died on stage while bringing Sanjeevani

10:34 AM ON 12th October, 2016 By Mirchi Vilas

A man died on stage while bringing Sanjeevani

లక్ష్మణుడు మూర్ఛబోతే, హనుమంతుడు సంజీవిని పర్వతం తెచ్చి బతికించాడని విన్నాం. కానీ సంజీవిని తెస్తూ హనుమంతుడు కన్నుమూయడం విన్నామా. నిజంగా చిరంజీవి అయిన హనుమంతునికి మరణం ఏమిటి అనుకోవచ్చు కూడా. అయితే హనుమంతుడి పాత్రను స్టేజీ మీద ప్రదర్శిస్తున్న ఓ కళాకారుడు ప్రమాదకరమైన ఫీట్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా హనుమాన్ మందిరంలో రామ్ లీల అనే నాటకం ప్రదర్శించారు. ఇందులో హనుమంతుడి పాత్రను 30 ఏళ్ల ధనరామ్ జాట్ పోషించారు. కథాపరంగా రాముడి తమ్ముడైన లక్ష్మణుడు మూర్ఛపోతాడు.

ఆయనను బతికించేందుకు సంజీవినీ పర్వతం తీసుకువచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. ఈ సందర్భంగా హనుమమంతుడు పైకి ఎగిరే ఘట్టం ఉంది. ఇందుకోసం ధనరామ్ నడుముకు రోప్ కట్టారు. అయితే ఊహించని విధంగా తాడు తెగిపోవడంతో 50 అడుగుల ఎత్తు నుంచి ధనరామ్ స్టేజిపై పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని హుటాహుడిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అక్కడి వారందరినీ కలచి వేసింది.

English summary

A man died on stage while bringing Sanjeevani