పగలు పూజారి.. రాత్రి దొంగ.. డ్యూయల్ రోల్ కాదు!

A man doing as a priest in morning and in evening turning as a thief

12:57 PM ON 1st September, 2016 By Mirchi Vilas

A man doing as a priest in morning and in evening turning as a thief

ఇదేదో సినిమాలో వేషం కాదు... డబుల్ రోల్ వేయడానికి.. రియల్ లైఫ్ లో ఒకడు పగలు పూజారి... రాత్రికాగానే దోపిడీ దొంగగా మారిపోతున్నాడు. ఇదేమిటీ? అనుకుంటున్నారు? నిజం... మహారాష్ట్రాలోని పూణే నగరంలో జరిగిన యదార్థ ఘటన ఇది. పూణే నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ పగలు బుద్ధవిహార్ సంరక్షకుడిగా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ సమాజంలో పెద్దమనిషిగా సుఖమయ జీవనం గడుపుతున్నాడు. ఇక రాత్రి కాగానే అసలు రూపం బయటకు వస్తోంది. ఉదయం చేసే బోధనలు, సూక్తులు అన్నీ మరిచిపోయి దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ముంబాయి, థానే పోలీసు కమిషనరేట్ ల పరిధిలో 25 దొంగతనాల్లో నింధితుడైన అజయ్ మధుకర్ గైక్వాడ్(43) ను పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. పూణేలోని దేహురోడ్డులోని బుద్ధవిహార్ సంరక్షకుడిగా ఉన్న అజయ్ మధుకర్ పెళ్లిళ్ల పేరయ్యగా పనిచేయడంతోపాటు బౌద్ధ పూజారిగా పెళ్లిళ్లు సైతం చేసేవాడని పూణే సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ సుష్మా చవాన్ చెప్పారు. పాత దొంగలైన ఇషాక్ ముహమ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ వీరన్ స్వామిల స్నేహం కారణంగానే సులభంగా డబ్బు సంపాదనకు మార్గంగా అజయ్ దొంగతనాలు ఎంచుకున్నాడని సుష్మా చవాన్ పేర్కొన్నారు.

పగలంతా మతం, సామాజిక అంశాలపై ప్రజలకు భోధనలు వినిపించే అజయ్ మధుకర్ రాత్రి కాగానే దొంగగా మారి... తన ఇద్దరు సహచరులతో కలిసి దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇలా ఐదేళ్లుగా సాగుతున్న దొంగతనాల గుట్టును పోలీసులు రట్టు చేసి నింధితుడిని జైలుకు పంపించారు. ఈ సంఘటన పూణే నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: మరీ ఇంత హాట్ గా తాప్సీని ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)

ఇది కూడా చదవండి: అభిమానికి బంపరాఫర్ ఇచ్చిన రష్మీ!

English summary

A man doing as a priest in morning and in evening turning as a thief