భార్యను గర్భవతిని చేయలేకపోయాడని పక్కింటి వ్యక్తి పై కేసు పెట్టిన ప్రబుద్ధుడు

a man filed a case on neighbor not to pregnant his wife

11:10 AM ON 6th February, 2017 By Mirchi Vilas

a man filed a case on neighbor not to pregnant his wife

పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. అందుకే, పిల్లలు కలగాలని ఏ దంపతులైనా కోరుకుంటారు. అందుకోసం సకల యత్నాలు చేస్తారు. ఒకవేళ పిల్లలు కలగకపోతే ఇక చేసేదేం లేక ఊరుకుంటారు, లేదంటే అనాథ పిల్లలను తెచ్చి దత్తత తీసుకుంటారు. ఇవన్నీ కాకుండా మరో వింత పద్ధతిలో పిల్లల్ని కావాలనుకున్న ఓ వ్యక్తికి మాత్రం నిరాశే మిగిలింది. ఇంతకీ అతను పిల్లల కోసం ఏం చేశాడో తెలుసా..? అదేంటో తెలుసుకుందాం.

జర్మనీలో సౌపోలోస్ (29) అనే వ్యక్తికి పిల్లలు పుట్టరు. ఆ విషయం డాక్టర్లు తేల్చేశారు. అతని భార్య మాజీ బ్యూటీ క్వీన్. దీంతో ప్రెస్టీజ్ కోసమైనా ఎలాగైనా సౌపోలోస్ పిల్లల్ని కనాలని అనుకున్నాడు. అందుకు తన పక్కింటి వ్యక్తి అయిన 34 ఏళ్ల ఫ్రాంక్‌తో సౌపోలోస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున 72 ప్రయత్నాల్లో తన భార్యను గర్భవతిని చెయ్యాలని సౌపోలోస్ చెప్పాడు. దీనికి ఫ్రాంక్ కూడా ఒప్పుకున్నాడు. ఇందుకోసం ఫ్రాంక్‌కు 2500 డాలర్లు కూడా సౌపోలోస్ ఇచ్చాడు. అయితే ఇది ఫ్రాంక్ భార్యకు ఏమాత్రం నచ్చలేదు. అయినా డబ్బు కోసమే చేస్తున్నానంటూ ఫ్రాంక్ తన భార్యను ఒప్పించాడు.. మొత్తానికి 72 ప్రయత్నాలు దాటినా సౌపోలోస్ భార్య గర్భవతి కాలేదు. దీంతో సౌపోలోస్ కు అనుమానం వచ్చి డాక్టర్లచే ఫ్రాంక్ను చెక్ చేయించగా అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో సౌపోలోస్ అవాక్కయ్యాడు.

సౌపోలోస్ జర్మనీలోని సేప్టీ గేట్ కోర్టులో తనకు న్యాయం చేయాలని కేసు వేశాడు. తన భార్యకు గర్భం తెప్పిస్తానని చెప్పి 2500 డాలర్లు తీసుకుని మోసం చేశాడని ఫ్రాంక్పై కేసు వేశాడు. అయితే ప్రస్తుతానికి ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. త్వరలో దీనిపై న్యాయమూర్తులు తీర్పును ఇవ్వనున్నారు. మరి వారు ఎలాంటి తీర్పును ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

. కాగా… సౌపోలోస్, ఫ్రాంక్‌లు చేసుకున్న ఒప్పందం ఏమో గానీ ఫ్రాంక్ భార్య గురించిన మరో నిజం వెలుగులోకి వచ్చింది. అది వారి పిల్లల గురించే. ఫ్రాంక్‌కు అసలు పిల్లలే పుట్టరని వైద్యులు చెప్పారు కదా, మరి అప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి వారు ఎలా వచ్చారని ఫ్రాంక్‌కు కూడా డౌట్ వచ్చింది. అయితే అందుకు ఫ్రాంక్ భార్య ఏం చెప్పిందో తెలుసా..? ఆ పిల్లలు ఫ్రాంక్ వల్ల పుట్టలేదని, వేరే వ్యక్తి వల్ల పుట్టారని, చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో ఈ సారి షాక్ తినడం ఫ్రాంక్ వంతైంది. మొత్తానికి భలే కేసు ఇది.

ఇది కూడా చూడండి: సమంతా ప్రేమకథ చీర ... ఎలా తయారు చేశారో తెలుసా?

ఇది కూడా చూడండి: ఎవరైనా కోపంతో అరిస్తే ... వెంటనే వారి నోట్లో చక్కెర వేయండి

English summary

a person put a case on his neighbor not to make his wife pregnant incident occurred in Germany.