మా చుట్టాలు వెళ్ళడం లేదంటూ పోలీస్ కేసు పెట్టాడు

A Man Files Case For his Relatives Not Going From His Home

06:31 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

A Man Files Case For his Relatives Not Going From His Home

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పట్టణం ఆర్ఎంఎస్ కాలనీలో నివాసం ఉండే కొర్రపాటి విజయేందర్‌రావు సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతడు ప్రస్తుతం తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు . ఇది ఇలా ఉంటె విజయేందర్‌రావు మనవడు, మనవరాలు వాళ్ళ పిల్లలతో సహా ఆయన ఇంటికి వచ్చారు. అయితే వారు ఎన్నిరోజులైనా వెళ్లకపోవడంతో విసుగు చెందిన విజయేందర్‌రావు స్థానిక పోలీసు స్టేషన్ లో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశారు. తన ఇంటికి బంధువులు వచ్చారని, వారు వచ్చి చాలా రోజులు అయ్యిందని , ఎన్ని రోజులు అయినా వారు వెళ్లకుండా తన ఇంట్లోనే తిష్టవేశారని, వారి కారణంగా తాను అప్పులపాలవుతున్నానని విజయేందర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు .

ఇవి కూడా చదవండి:ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

తన మనవడు, మనవరాలు, వారి పిల్లలను ఎలాగైనా తన ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. తొలిసారిగా ఇలాంటి విచిత్రమైన ఫిర్యాదు రావడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. పోలీసులు ‘మీ బంధువులను మీరే పంపించేయొచ్చు కదా’ అని అంటే , వాళ్లు తన మాట వినరని, మీరే వాళ్ళ పై కేసు నమోదు చేసి వాళ్ల పై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఉదయం కేసు పెట్టిన విజయేందర్‌రావు మళ్లీ సాయంత్రమే స్టేషన్‌కు వెళ్లి నిలదీసేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు మౌనం వహించారు.

ఇవి కూడా చదవండి:చైతూకి క్లాస్ పీకిన వెంకీ!

ఇవి కూడా చదవండి:భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

English summary

A Man Named Vijeyandar Rao In Guntur District files case on police station by saying that His Grand Son and Grand Daughter were came to Summer Holidays and not vacating his house.