సూర్యుడిపై కేసు?

A Man Files Case On Sun

12:09 PM ON 8th June, 2016 By Mirchi Vilas

A Man Files Case On Sun

కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు... చాలామంది దేవుణ్ణి నమ్మకపోయినా సూర్యుణ్ణి ఆరాధిస్తారు. అలాంటి సూర్యుణ్ణి శిక్షించాలని ఓ ప్రబుద్ధుడు అంటున్నాడు. "ఒక లెక్కా పత్రం లేకుండా చండ్రనిప్పుడు కురిపిస్తూ మమ్మల్ని నానా బాధలు పెట్టిన సూర్యుణ్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను" ఇది చదివిన తరువాత ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? అని మీకు డౌట్ రావొచ్చు.కానీ వాస్తవంగా ఇది జరిగింది. రాజస్థాన్ కు పొరుగునే ఉన్న ఫలోడీ అనే చోట జరిగిందీ వింత( దీనినే సాల్ట్ సిటి అనికూడా అంటారు). అసలు సూర్యుడిపై కేసేంటి? అనేగా మీ అనుమానం.

మధ్య ప్రదేశ్ లోని షాజా పూర్ కు చెందిన శివపాల్ సింగ్ అనే వ్యక్తి గత నెల పంతొమ్మిదో తేదీన ఫలోడికి వచ్చాడు. అదే రోజు ఫలోడి లో ఉష్ణోగ్రతలు 51 డిగ్రీల సెల్షియస్ కు చేరకున్నాయి. దీంతో సూర్యడి వేడిమి తట్టుకోలేక చిన్నాచితకా, ముసలీ ముతకా తో పాటు నోరు లేని మూగజీవాలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో వళ్లు మండిపోయిన శివపాల్ సింగ్ ప్రపంచానికి వేడిమిని ప్రసాదించే సూర్యుడి పై నిప్పులు చెరిగాడు. జాలి దయ లేకుండా విపరీతమైన ఉష్ణోగ్రతలతో సతాయిస్తున్న సూర్యుడి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసు వేశాడు. ఆసక్తి రేకేత్తించే ఈ కథనం మీడియాలో హల్ చల్ చేసేస్తోంది.

An official complaint to register an FIR against Sun for excessive heat. Hilarious.

A photo posted by Roman Saini (@drromansaini) on

English summary

A Man Named Shiva Pal Singh in Rajasthan files a police case on Sun. He filed case because when he visited Rajasthan he found that the temperature was 51 degrees and due to this so many people and birds were suffering and died due to heavy temperatures.