మరోసారి ఉలిక్కిపడ్డ అమెరికా

A man firing on police in America

04:08 PM ON 20th July, 2016 By Mirchi Vilas

A man firing on police in America

అవును, డాలస్, బ్యాటెన్ రోజ్ ఘటనలు మరవకముందే అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అక్కడ మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇటీవల లూసియానాలోని బ్యాటన్ రోజ్ లో పోలీసులపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడగా ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందగా.. ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. తాజాగా న్యూయార్క్ లో ఇద్దరు పోలీస్ అధికారులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అయితే అదృష్టవశాత్తు పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. న్యూయార్క్ లో ఇద్దరు పోలీసులు నడుచుకుంటూ వెళ్తుండగా..

కారులో వెళ్తున్న నలుగురు యువకులు వారిపై కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం వారు కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘటన నుంచి పోలీసులు అనూహ్యంగా తప్పించుకోగలిగారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనియన్ పోలీసులు తెలిపారు. ఇటీవల వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని యూనియన్ కోరింది.

English summary

A man firing on police in America