గూగుల్ ఓనర్ కి నిమిషానికి 8 లక్షలు

A Man Gets 8 Lakhs For Puechasing Google Domain

05:35 PM ON 1st February, 2016 By Mirchi Vilas

A Man Gets 8 Lakhs For Puechasing Google Domain

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన యజమానికి నిమిషానికి 8 లక్షలు ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది అతనికి ఇచ్చిన నజరానా.. నజరానా ఎందుకు? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.. ఇంతకీ గూగుల్ యజమాని ఎవరో తెలుసా.. మన భారతీయుు సన్మయ్ వేద్. అందేంటి గూగుల్ విదేశీయులది కదా.. దానికి సీఈవో మాత్రం సుందర్ పిచయ్ కదా అని అనుకుంటున్నారా.. మీరు అనుకునేంది కరెక్టే.. కానీ వేద్ కూడా గూగుల్.కామ్ యజమాని కాకపోతే ఒకే ఒక్క నిమిషానికి మాత్రమే. రాజస్థాన్‌ కచ్‌ సమీపంలోని మాండ్వీకి చెందిన సన్మయ్‌ ఇంటర్నెట్‌ పరిశోధకుడు. ఇంటర్నెట్‌లో బగ్స్‌ను గుర్తించడం ఇతనికి నిత్య కృత్యం. గతేడాది సెప్టెంబర్‌లో గూగుల్‌ డొమైన్స్‌ కోసం శోధన చేస్తుండగా, గూగుల్‌.కామ్‌ అనే డొమైన్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే 12 డాలర్లు చెల్లించి దానిని సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషం పాటు అతను గూగుల్‌.కామ్‌ డొమైన్‌కు యజమానిగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన గూగుల్‌ అతనికి సుమారు 6 వేల డాలర్లు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే తనకు వచ్చిన సొమ్మును స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు లింక్డ్‌ ఇన్‌ ద్వారా తెలపడంతో ఆ మొత్తానికి రెట్టింపు సొమ్మును అతనికి అందజేసింది. 2015లో తొమాస్‌ బొజరస్కీ అనే వ్యక్తి గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో 70 బగ్స్‌ గుర్తించాడు. ఇలా బగ్స్‌ను గుర్తించిన సుమారు 300మందికి గతేడాది గూగుల్‌ 2 మిలియన్‌ డాలర్ల వరకు బహుమానంగా ఇచ్చింది. 2010 నుంచి మొత్తం 6 మిలియన్‌ డాలర్లను ఇచ్చినట్లు సమాచారం.

English summary

A man from Katch ,India books www.google.com domain for 12 dollars and later Search engine giant Google has paid Sanmay Ved, the man who owned Google.Com for a minute and google paid 8 lakhs to him