ఇచ్చిందేమో  మొబైల్‌ ... వచ్చిందేమో  పౌడర్

A man gets powder instead of Mobile on Online Shopping

10:55 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

A man gets powder instead of Mobile on Online Shopping

పత్రికల్లో ప్రకటన చూసి ఆన్లైన్ లో ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే, వచ్చింది మరోటి అవుతున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఆన్లైన్ లో ఇలాంటి వాటికి మోసపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గుర్లలో ఓ వ్యక్తి ఆన్‌లైన్లో మొబైల్‌ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే, ఫేస్ పౌడర్‌ వచ్చిందట. మండలంలోని సదానందపురం గ్రామానికి చెందిన టి.జనార్దన్‌రావు ఓ దినపత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఆన్‌లైన్‌లో మొబైల్‌ఫోన్‌ ఆర్డర్‌ చేశాడు. ఇందుకోసం సదరు కంపెనీకి రూ.3వేలు ఆన్‌లైన్లోనే చెల్లించాడు. ఇంటికి వచ్చిన పార్శిల్‌ని తెరచిచూడగా అందులో మొబైల్‌ఫోన్‌కు బదులుగా ఫేస్ పౌడర్‌ ఉండడంతో ఖంగుతిన్నాడు. దీంతో జనార్దన్‌రావు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసాడు. వినియోగదారులూ ఆన్ లైన్ లో జాగ్రత్త ....

English summary

A man from Vijayanagaram district ordered a mobile phone in one of the online shopping site and he paid three thousand rupees for that but that man received Talcum Power instead of mobile phone.He complained to police on this issue.