ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ కి 10 లక్షలు ఇచ్చాడు.. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి

A man gets suicide for giving 10 lakhs to facebook friend

11:30 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

A man gets suicide for giving 10 lakhs to facebook friend

ఎదురుగా వున్నవాళ్ళతో మాటామంతీ లేకుండా ఎక్కడో ఫ్రెండ్ పేరిట ఫేస్ బుక్ లో నిత్యం గడిపే వాళ్లకు మరీ ముఖ్యంగా ముక్కూ మొహం తెలియని వాళ్ళ మాటల్లో పడిపోయి మోసపోయే వాళ్లకు ఇదో చెంప పెట్టు. దేనికైనా హద్దు ఉంటుంది. అతి అత్యంత ప్రమాదం. తాజాగా ఫేస్ బుక్ పరిచయాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని ఒక దానం హల్ చల్ చేస్తోంది. ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్న ఓ యువతి కారణంగా.. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. కడప జిల్లా కాజీ పేటకు నరసింహ వరప్రసాద్ కాజీపేట బస్టాండ్ లో టీ దుకాణం నడుపుతూ ఉంటాడు.

విశాఖకు చెందిన ఓ యువతితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు. ఈ పరిచయంలో విశాఖ యువతి మాయ మాటలు చెప్పి ప్రసాద్ దగ్గర 10 లక్షలు డబ్బు తీసుకుంది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అతడు అడగడంతో సదరు యువతి మొహం చాటేసింది. ఇక యువతి మోసంతో మనస్తాపం చెందిన వరప్రసాద్ ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడి ఫేస్ బుక్ అకౌంట్, ఫేస్ బుక్ సంభాషణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో కల్యాణి అనే పేరు ఉండగా.. ఫోన్ రికార్డ్ లలో అనుశ్రీ, కవిత అని వేరే పేర్లు ఉన్నట్లు తేలింది. దీని పై పోలీసులు విచారణ ప్రారంభించారు. అపరిచితులతో తస్మాత్ జాగ్రత్త.

English summary

A man gets suicide for giving 10 lakhs to facebook friend