రోజూ రాత్రి అమీర్ పేట్ లేడీస్ హాస్టల్ లో దూరి ఏం చేస్తున్నాడో తెలుసా?

A man going to ladies hostel in midnight

05:32 PM ON 19th August, 2016 By Mirchi Vilas

A man going to ladies hostel in midnight

హైదరాబాద్ కి ఉద్యోగం, కోర్స్ లు చెయ్యడానికి వచ్చే ఆడవాళ్లు ఎక్కువగా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి లేడీస్ హాస్టల్స్ లోనే ఉంటారు. ఎందుకంటే లేడీస్ హాస్టల్స్ ఎక్కువగా ఈ ఏరియాలోని ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా తక్కువలో హాస్టల్స్ లభిస్తాయి. అయితే లేడీస్ హాస్టల్స్ భద్రతలో చాలా తక్కువని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఆసక్తికరమైన ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. లేడీస్ హాస్టల్స్ లో సెల్ ఫోన్ లు దొంగిలించి అందులో ఉన్న నెంబర్ల వారికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న యువకుడిని కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కుషాల్కర్ వివరాలు తెలియజేసారు.

కరీంనగర్ పెద్దంపేటకు చెందిన సిలివేరి సంతోష్ కుమార్ బోరబండ పర్వతనగర్ లో నివసిస్తూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోగల లేడీస్ హాస్టల్స్ లో రాత్రిపూట దూరి సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడు. ఆ సమయంలో వారు మేల్కొన్నప్పుడు బ్లేడ్ చూపించి బెధిరించేవాడు. ఓ హాస్టల్ లో ఉంటున్న మహిళ ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నింధితుడిని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని 8 సెల్ ఫోన్ లు, రెండు మెమరీకార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అతడిపై వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో 9కేసులు నమోదయ్యా యన్నారు. కరీంనగర్ లో మహిళలను గతంలో వేధించిన కేసులో జైలుకెళ్లి వచ్చాడు. నింధితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఏ హాస్టల్ ల్లోనూ సీసీ కెమెరాలు లేవని.. ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీఐ సూచించారు.

English summary

A man going to ladies hostel in midnight