ముప్పావు గంట ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంది

A Man Heart Stopped For 45 Minutes

03:47 PM ON 20th April, 2016 By Mirchi Vilas

A Man Heart Stopped For 45 Minutes

వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ వుంటాయి... అరుదైన ఘటనలతో అందరూ ఆశ్చర్యానికి గురవుతూ వుంటారు. తాజాగా చెన్నైలోని ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసారు. వైద్య శాస్త్రంలో అరుదైన ఘటన ఇది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే , గుజరాత్‌కు చెందిన జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ (38)కు హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్‌ మలర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హృదయస్పందన నిలిచిపోవడంతో 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్యవిధానం ద్వారా ఎట్టకేలకు గుండెను కొట్టుకునేలా చేశారు.

ఇవి కూడా చదవండి :సిగరెట్ తాగనివ్వరు..కడుపు చేస్తానంటే అదీ కాదంటారు(వీడియో)

ఈ సందర్భంగా ఆస్పత్రి కార్డియాక్‌ సైన్సెస్‌ సంచాలకులు డాక్టర్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ...'గుండెపోటు పరిస్థితుల్లో ఈసీపీఆర్‌ (ఎక్‌స్ట్రాకార్పొరియల్‌ కార్డియోపల్మనరీ రెస్క్యుటేషన్‌) అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్యవిధానం సంక్లిష్టమైనది. జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ విషయంలోనూ ఇదే విధానాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించాం. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పదిరోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారు, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించాం. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న ఆయన డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు' అని వివరించారు. ఈ సందర్భంగా రోగికి వైద్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి త్వరగా కోలుకున్నందుకు అభినందనలు తెలిపారు

ఇవి కూడా చదవండి :

డబ్బివ్వకుంటే కలిసున్న ఫోటోలు నెట్లో పెడతా

కోహ్లీ నన్ను లైంగికంగా వేధించాడు

English summary

A Man from Gujarat was Suffering with heart disease and he was shifted to Chennai hospitals for better treatment and suddenly the man Heart Stopped for 45 minutes and later again his heart started beating normally.