తాగి డ్రైవింగ్ చేసి.. ఇద్దరిని చంపేసి.. నాన్న దగ్గర డబ్బు తీసుకోమన్న యువకుడు(వీడియో)

A man hits with car and run

10:35 AM ON 15th June, 2016 By Mirchi Vilas

A man hits with car and run

రాను రాను పెంపకాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. తండ్రులు సంపాదించిన ఆస్తి చూసి, పిల్లలు రెచ్చిపోతున్నారు. ఎక్కడి దాకా పోతున్నాయంటే, ఏక్సిడెంట్ చేసి, ఇంటి దగ్గర మా నాన్న డబ్బులు ఇస్తాడు తీసుకోండనే స్థాయికి వ్యవహారం వచ్చేసిందంటే ఏమనాలి. తాజాగా జరిగిన ఈ ఘటన ఓసారి చూడండి. న్యూఢిల్లీకి చెందిన రిషబ్ రావత్(21) కారులో చేసిన జర్నీ ఐదు నిముషాల్లోపే.. రెండు యాక్సిడెంట్లు చేశాడు. ఇద్దరు చనిపోగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇతగాడి జట్ స్పీడ్ వేగాన్ని అందుకుని ఓ కానిస్టేబుల్ కారు ఆపాడు. ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? తాపీగా సిగరెట్ కాల్చుకోవడానికి లైటర్ అడిగాడు.

పోతూ పోతూ యాక్సిడెంట్లకు డబ్బులు మానాన్న దగ్గర కలెక్టు చేసుకోండి అంటూ గీరగా సమాధానమిచ్చి ఉడాయించాడు. పీకలదాకా తాగి ఇతగాడు రోడ్డు పై చేసిన మారణకాండ అవశేషాలను వీడియాలో చూడొచ్చు. జనక్ పురిలో నివాసముండే రిషబ్ తండ్రి హార్డువేర్ షాపు నడిపిస్తాడు.. రాత్రివేళ పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివ్ నగర్ లోని తన స్నేహితుని ఇంట్లో పార్టీ చేసుకున్నాడు. పీకలదాకా తాగాడు.. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియదు.. ఆ పై కారు డ్రైవింగ్.. అంతే అడ్డొచ్చిన వారందరినీ గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. ఇద్దరు అక్కడికక్కడే మృత్యవాత పడగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

కష్టం మీద ఓ పోలీసు కారు ఆపితే.. చనిపోయిన వారికి మా డాడీ డబ్బులిస్తాడు తీసుకోండంటూ పొగరుబోతు సమాధానం ఇచ్చాడు. హోండా సిటీని ఇష్టం వచ్చినట్లుగా నడుపుతూ ఓ వ్యక్తి తన కారు అద్దం పై పడి అది పగిలినా ఏం చేస్తున్నాడో తెలియకుండా అలాగే ముందుకెళ్లిపోయాడు. కొద్ది దూరం తర్వాత మరో వ్యక్తి ఢీకొడితే అతడు పక్కనే ఉన్న గోడకు బలంగా ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా చూసిన ఓ కానిస్టేబుల్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన బైక్ తో ఎలాగోలా కారును ఓవర్ టేక్ చేసి ఆపగలిగాడు. కారులో నుంచి దిగిన రిషబ్.. కానిస్టేబుల్ను సిగరెట్ లైటర్ అడిగి.. చనిపోయిన వారికి మా డాడీ డబ్బులిస్తాడంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.

మొత్తానికి అతన్ని అరెస్ట్ చేసి జనక్ పురి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 304, 308 కింద కేసులు నమోదు చేశారు.

English summary

A man hits with car and run