80గంటలు ఏకధాటిగా పరుగో పరుగు

A Man In California Runs Continuously 563 Kilometers In 80 Hours

11:55 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

A Man In California Runs Continuously 563 Kilometers In 80 Hours

వ్యాయామం , పరుగు చేయడం కష్టం అని భావించే సమయం ఇది. పోనీ పరుగు పెట్టాలంటే, ఒక కిలోమీటర్‌ ఆగకుండా పరిగెత్తితేనే నీరసం వచ్చి కూలబడడం ఖాయం. ఇక ఆయాసంతో పాటు కాళ్ల నొప్పులు పుడతాయి. అదే అథ్లెటిక్స్‌లో పాల్గొనే పరుగుల వీరులైతే.. కొన్ని కిలోమీటర్ల సునాయసంగా పరుగెత్తగలరు. అయితే ఎంత దూరం పరిగెత్తినా.. ఎప్పుడో అప్పుడు అలసిపోక తప్పదు. కానీ.. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. ఎలాంటి అలసట.. నొప్పులు లేకుండా ఆగకుండా 563 కి.మీలు పరుగెత్తాడు. 53 ఏళ్ల డీన్‌ కార్నజెస్‌కు మాత్రం అలాంటి నొప్పులు అసలు రావట. అందుకే అంతేకాదు.. 50రోజుల్లో 50 మారధాన్లలో నొప్పనేదే తెలియకుండా పరిగెత్తి అందరనీ ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి:స్యూసైడ్ కోసం దూకి - రెండు సింహాల్ని చంపించాడు...

శరీరంలో గ్లూకోజ్‌ శాతం తగ్గిపోగానే.. లాక్టిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి అవుతుంది. అది ఎముకల్ని బలహీనం చేస్తుంది. పరుగెత్తే వారిలో గ్లూకోజ్‌ ఖాళీ అవగానే శక్తి హరించుకుపోయి లాక్టిక్‌ యాసిడ్‌ వల్ల నొప్పులు.. నీరసం వచ్చేస్తాయి. కానీ.. జన్యు లోపంతో అతని శరీరంలో లాక్టిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి అవ్వదని చెబుతున్నారు. ఇది తెలుసుకున్న డీన్‌ రికార్డు సాధించేలా ఏదైనా చేయాలని భావించాడు. దీంతో అతనికి పరుగెత్తే సమయంలో ఆయాసం.. నొప్పులు అనేవి రావు. దాన్ని అమలు చేస్తూ 80గంటలు ఎక్కడ ఆగకుండా.. నిద్రపోకుండా 563 కి.మీలు పరిగెత్తాడు. ఓ ది గ్రేట్....

ఇవి కూడా చదవండి:బస్సులోనే జిమ్ - ప్రయాణంలోనే వ్యాయామం

English summary

A man Named Dean Karnazes from California was set a new world record by running 563 kilometers distance continuously in Just 80 hours.