హవ్వ ! భార్య పుట్టింటికి పోయిందని... దేవుడిపై దాడి ..

A Man In Indore Smashes Hanuman Statue

11:27 AM ON 27th June, 2016 By Mirchi Vilas

A Man In Indore Smashes Hanuman Statue

వెర్రి వేయి విధాలు అన్నారు కదా, కానీ వెర్రి ముదిరితే ఏమి చేస్తున్నామో కూడా తెలియని విధంగా ప్రవర్తించే వాళ్ళు పెరిగిపోతున్నారు. చివరకు దేవుడి మీద దాడికి తెగ బడుతున్నారు. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన గురించి చదివి తీరాల్సిందే. ఏ దిక్కూ లేనొళ్లకు దేవుడే దిక్కంటుంటారు. ఆ నమ్మకంతోనే చాలామంది కష్టాల్లో ఉన్నవాళ్లు దేవుడికి మొక్కుతారు. పూజలు చేస్తారు. కోర్కెలు తీర్చమంటూ మొక్కులు మొక్కుతారు. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే అంతా ఆ దేవుడి దయా అంటారు. దేవుడిని నమ్మిన తర్వాత కూడా అవే కష్టాలు కంటిన్యూ అయితే దేవుడే లేడంటారు. కొంతమంది అంతా ఆ పైవాడి లీల అంటూ చెబుతుంటారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మనోజ్ బంజారా అనే ఓ వ్యక్తి వీటన్నింటికీ విరుద్ధంగా వ్యవహరిస్తూ, దేవుడు తన ప్రార్థనను ఆలకించలేదంటూ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

మనోజ్ బంజారాకు, అతని భార్యకు గొడవలయ్యాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నించాడు. కానీ అతని భార్య మంకుపట్టు ముందు అతని ప్రయత్నాలేవీ నిలవలేదు. చివరకు చేసేదేమీ లేక ఇండోర్ లోని పల్డా ప్రాంతంలో ఉన్న ఖెడపటి హనుమాన్ దేవాలయానికి వెళ్లాడు. తన భార్య తిరిగిరావాలంటూ ప్రార్థనలు చేశాడు. ఎన్నిరోజులైనా భార్య తిరిగిరాకపోవడంతో దేవుడిపై పగ పెంచుకున్న మనోజ్ ఆదివారం గుడికెళ్లి హనుమాన్ విగ్రహ ధ్వంసానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో అతనిని సిటీ సూపర్డెంట్ శశికాంత్ అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ తో నటించే భామ రేటు తెలిస్తే షాకవుతారు!

ఇవి కూడా చదవండి:రమ్య కృష్ణ కండీషన్ వింటే షాకవ్వాల్సిందే

English summary

A Man Named Manoj Banjara who belongs to Indore,Madhya Pradesh was tried to Samsh Lord Hanuman Statue because he praised Lord Hanuman to bring back his wife and his wife not acccepted to come with him and Manoj got angry and tried to Smash Lord Hanuman Statue and police arrested him and taken into their custody.