పాపం.. 19 నెలల  కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

A Man In London Marries His 19 month Old Baby

09:49 AM ON 28th March, 2016 By Mirchi Vilas

A Man In London Marries His 19 month Old Baby

ఈ ప్రపంచంలో ఎన్ని ఘోరాలు , నేరాలు , మోసాలు జరుగుతూ వస్తున్నాయి. అకృత్యాలు , అత్యాచారాలు , మహిళలపై లైంగిక వేధింపులు ఇలా ఒకేటేమిటి ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది బలవుతున్నారు. అయితే ఈ ఘటన అందుకు పూర్తి విరుద్ధం ... ఇది నిజంగా చాలా విషాధకర సంఘటన. మరికొన్ని రోజుల్లో మృత్యువు కోరల్లో చిక్కుకోనున్న 19 నెలల చిన్నారిని తండ్రి పెళ్లాడిన హృదయవిదారక ఘటన వివరాల్లోకి వెళ్తే,... లండన్‌కు చెందిన ఆండీ బార్నార్డ్‌ (31), సమ్మీ (29)ల ముద్దుల కూతురు పప్పీ. ఇద్దరు కొడుకుల తర్వాత మూడో సంతానంగా పప్పీ పుట్టడంతో ఎంతో ఉప్పొంగిపోయాడు ఆ తల్లి దండ్రులు ... అందుకే అపురూపంగా పెంచుకుంటున్నారు.

భవిష్యత్తులో తన కూతురికి ఘనంగా వివాహం చేస్తానని కూడా తండ్రి అందరికీ గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ విధి బలీయ మంది అంటారు కదా ... అందుకే అయితే ఆండీ కలలన్నీ కల్లలుగా మారాయి. తమ గారాల పట్టీ 19 నెలల చిన్నారి పప్పీ క్యాన్సర్‌ బారిన పడింది. అయితే ట్యూమర్లు ఒక్క దగ్గిరే కాకుండా కిడ్నీ, లివర్‌, బ్రెయిన్‌ వంటి కీలక అవయవాల్లో ట్యూమర్లు ఏర్పడి పాప ప్రాణానికి ప్రమాదకరంగా పరిణమించాయి. దీంతో వైద్యులు చేతులెత్తేశారు. చికిత్స తీసుకుంటే కొన్ని రోజులైనా బతుకుతుందని, తీసుకోకుంటే రెండు రోజుల్లోనే మరణిస్తుందని తేల్చి చెప్పేశారు. దీంతో బార్నార్డ్‌ ఆండీ హృదయం తట్టుకోలేక పోయింది. . తన పాప బతకినంత కాలమూ సంతోషంగానే గడపాలని ఇంటికి తీసుకు వచ్చేశాడు. ఇంతలో తన పాపకు ఘనంగా వివాహం చేస్తానంటూ స్నేహితులందరికీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

అందుకే పాప చనిపోయేలోపు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్యం మంచిదే అయినా కొన్ని రోజుల్లో చనిపోయే ఆ పసి పాపను వివాహమాడడానికి ఎవరూ సాహసించలేదు దీంతో గంత్యంతరం లేక ఆండీయే పెళ్లి కొడుకుగా మారి తన కూతురిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశాడు. బంధువులందరినీ ఆహ్వానించి ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దాడు. అయితే పెళ్లికి హాజరైన వారంతా ఏడుస్తూనే కూర్చున్నారు. భోజనాలు కూడా చేయకుండానే పెళ్లి తంతు అయిందనిపించి భారమైన హృదయాలతో అంతా వెనుదిరిగారు. అది నిజంగా అరుదైన ఘటనే ... అందరికీ కన్నీళ్లు తెప్పించే సంఘటన ...

ఇవి కూడా చదవండి

మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

కూతురికి మత్తిచ్చి వ్యభిచార కూపంలో దింపిన తల్లి

భర్త పై కోపంతో వేడి నూనె పోసి నరకం చూపించింది

భర్త పై కోపంతో వేడి నూనె పోసి నరకం చూపించింది

English summary

A Man in London Married his 19 year old baby . Baby was suffering from cancer and doctors had said that she wont be alive more than two days and that's why he married his own daughter in a grand manner. The guests were cried by seeing this baby.