అతని ఫోన్ కి అన్ని మెసేజ్ లకు కారణం అదా?

A Man In Manglore Gets Hundreds Of Messages To His Cell Phone

01:07 PM ON 6th June, 2016 By Mirchi Vilas

A Man In Manglore Gets Hundreds Of Messages To His Cell Phone

సెల్ ఫోన్ కి మెసేజ్ లు రావడం సహజం .. రకరకాల మెసేజ్ లు విసుగు పుట్టిస్తుంటాయి కూడా.. కానీ మంగళూరుకు చెందిన అబ్దుల్ కరీమ్ అనే ఓ వ్యాపారవేత్తకు వందల్లో మెసేజ్ లు రోజూ వచ్చేస్తున్నాయ్ వ్యాపారవేత్త అన్న తరువాత సందేశాలు, ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడం సహజం. కానీ కొన్ని రోజుల నుంచి అబ్దుల్ ఫోన్ కు అదే పనిగా మెసేజ్ లు వస్తున్నాయి. వంద కాదు... రెండువందలు కాదు... ఏకంగా రోజుకు 300కు పైగా సందేశాలు వస్తున్నాయి. ఈ రేంజ్ లో సందేశాలు రావడంపై అబ్దుల్ ఆరా తీస్తే, అసలు విషయం బయటపడింది. అబ్దుల్ ఫోన్ నెంబర్ పొరపాటున ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునే నెంబర్ కు బదులుగా ముద్రించారట. పైగా ఈ నెంబర్ ను పోస్టర్ల పై వేసి గోడలపై అంటించారు. మరి మెసేజ్ లు పుంఖాను పుంఖాలుగా రాక చస్తాయా? ఒక్క నంబర్ పొరపాటున ముద్రించడం వల్ల ఎన్ని తిప్పలో మరి..

ఇవి కూడా చదవండి:దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

ఇవి కూడా చదవండి:కస్టమర్లకు కంపెనీ ఇచ్చే రోబోలు!

English summary

A Business man Named Abdul Kareem was getting Hundreds of Messages to his cell phone and he used to ask inquiry about that and he came to know that his number was mistakenly printed in the posters of Aadhar Card Registration Number.