40 సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తిని చూశారా?

A man is not sleeping from 40 years

12:04 PM ON 24th May, 2016 By Mirchi Vilas

A man is not sleeping from 40 years

మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడో, లేక ఏ పెళ్లికైనా వెళ్ళినప్పుడో ఒకరోజు నిద్రకి దూరంగా ఉంటాం.. అలాంటప్పుడు ఆ తరువాత రోజంతా నిద్రలోనే మునిగిపోతాం. అసలు సాధారణంగా ఓ మనిషి తన జీవిత కాలం మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు అనే విషయంలో సరైన కొలమానాలు ఏవీ లేకపోయినా రోజులో సగం గంటలు మనిషి నిద్రపోతాడని గతంలో పెద్దలు చెప్పేవారు. అయితే తర్వాత అది కాస్త 8 గంటలుగా లెక్క తేల్చారు. ఆరోగ్యంగా ఉన్న యువకులు రోజుకు 6 గంటలు నిద్రపోతే, కాస్త వయస్సు ఉన్న వారు 8 గంటలు నిద్రపోతారని పలు పరిశోధనల్లో తేలింది. ఈ 8 గంటల్లో కొద్దిగా అటూఇటూ అయితే నిద్రలేమి సమస్యతో అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.

అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 40 సంవత్సరాల పాటు నిద్రపోకుండా ఉన్నాడంటే నమ్మగలుగుతారా... నమ్మాల్సిందే. ఇది నిజం యూరప్‌లోని హంగేరీకి చెందిన పౌల్ కెర్న్ అసలు 8 గంటలు కాదు కదా... సుమారు 40 సంవత్సరాల పాటు నిద్రపోకుండా జీవించాడు. కెర్న్ 1915లో ఈస్ట్రన్ ఫ్రంట్ సైన్యాధికారిగా పనిచేసేవాడు. 1915లో జరిగిన యుద్ధంలో అతని తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ సమయంలో కెర్న్ మెదడు ముందు భాగానికి గాయమైంది. అప్పుడు చికిత్స తర్వాత లెంబర్గ్లోని వైద్యులు బుల్లెట్‌ను తొలగించారు. ఆ గాయం నుంచి కోలుకున్న దగ్గర్నుంచి కెర్న్ 1955లో అతను చనిపోయేదాకా కంటి మీద కునుకువేయలేదట.

దీనికి మెదడులో తగిలిన గాయమే కారణమని వైద్యులు చెప్పారు. అయితే కెర్న్ రోజుకు రెండు గంటలు కళ్లు మూసేవాడట. కానీ నిద్రపోయేవాడు కాదట. అతను కళ్లు మూసుకున్నప్పటికీ అలర్ట్‌గానే ఉండేవాడని అతనికి చికిత్స చేసిన వైద్యులు చెబుతున్నారు.

English summary

A man is not sleeping from 40 years