సంపద, సౌఖ్యాల కన్నా.. నిద్ర కావాలట

A man is suffering with Insomnia

11:32 AM ON 16th July, 2016 By Mirchi Vilas

A man is suffering with Insomnia

ఏమి వున్నా లేకున్నా సంపద ఉంటే చాలు అన్నీ వాటంతటవే వస్తాయని అంటారు కదా. కానీ సంపద, సౌఖ్యం కన్నా, నిద్ర ఉంటే చాలని ఓ వ్యక్తి అంటున్నాడు. ఒకరోజు ఓ స్వామీజీ దగ్గరకు వెళ్లిన అతడు, నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చాలా ధనవంతుడిని. నాకున్నదాంట్లో సగభాగాన్ని దానధర్మాలు చేశా. మిగిలిన దానితో జీవితం సాఫీగా గడిచిపోతున్నా నాకు నిద్ర మాత్రం పట్టడంలేదు. తృప్తి లేదు. నాకసలు సంపద, సౌఖ్యాలు అవసరం లేదు. కేవలం నిద్ర ఉంటే చాలు. దీనికి నేనేమి చేయాలో చెప్పండి స్వామీజీ అంటూ అడిగాడు. సంపద అక్కరలేదంటున్నావు, నిద్ర కావాలంటున్నావు.

అంటే ఇప్పుడు నీకు నిద్రే సంపద అయిందన్నమాట. ఒకసారి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి, జీవితంలో యదార్థంగా సంభవించగలిగే వస్తువు ఏది కావాలో కోరుకోమని వరమడిగితే, ఏమని అడుగుతావు? అని అడిగారు. కొంతమంది కారు కావాలని, కొంతమంది లక్ష రూపాయలనీ, ఇలా మరికొంతమంది తమకేవి ఇష్టమో చెప్పారు. అందుకు అధ్యాపకుడు... ఓరి అభాగ్యులారా... ఎందుకు వీటిని కోరుకున్నారు? బుర్రలిమ్మని, మేధస్సునిమ్మని అడగాలని సూచించాడు. అందుకు బదులుగా ఒక విద్యార్థి లేచి, ఎవరైనా తమ దగ్గర ఏది లేదో అది అడుగుతారు కదా అని అన్నాడు.

కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కరువైంది నీ సంపద. నిద్ర గొప్ప సంపద. అదే గొప్ప సుఖం. ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి ఇది ఒక సమస్య కాదు. ధ్యానంలో నిమగ్నులు కండి. నిద్ర దానంతట అదే వస్తుంది. అంటూ స్వామీజీ హితవు పలికారు.

English summary

A man is suffering with Insomnia