సెల్ఫీ బానే వచ్చింది.. కానీ మనిషే అదృశ్యం(వీడియో)

A man jumped into river for selfie but he is not back

05:42 PM ON 8th July, 2016 By Mirchi Vilas

A man jumped into river for selfie but he is not back

ప్రస్తుత లోకంలో ప్రతి ఒక్కరూ ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా లో షేర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఒక్కోసారి ఈ ఉత్సాహం బెడిసికొట్టి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్న ఆశీష్ చౌహాన్(27) అనే యువకుడు.. ఆ తరువాత బయటికి రాలేదు. స్నేహితులు రెచ్చగొట్టడంతో బాగా మద్యం తీసుకుని ఉన్న ఆశీష్ గోదారిలో దూకి ఈతకొట్టి బయటికి వద్దామనుకొని అనుకున్నాడు. అయితే.. దూకి 48 గంటలు గడుస్తున్నా.. అతని ఆచూకీ దొరకలేదు.

అతను ఈత కొట్టడంలో ఘనుడని, కాకాపోతే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో అతను అనుకున్నట్టుగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ.. అతని ఆచూకీ మాత్రం దొరకలేదు.

English summary

A man jumped into river for selfie but he is not back