11 అంతస్తుల పై నుండి దూకాడు.. కానీ ఏమీ కాలేదు(వీడియో)

A man jumps from the 11 floors of the building

12:23 PM ON 9th May, 2016 By Mirchi Vilas

A man jumps from the 11 floors of the building

ఆత్మహత్య చేసుకోవాలని ఓ వ్యక్తి 11వ అంతస్తు పై నుండి దూకాడు. అయితే ఆ వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. ఈ ఘటన చైనాలో జియంగ్సులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో 11 అంతస్తుల బిల్డింగ్‌ పైకి ఎక్కాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు రెండు గంటల పాటు అతని కిందకి దించడానికి ప్రయత్నించారు కానీ ఫలించలేదు. ఆ వ్యక్తి బిల్డింగ్‌ పై నుండి ఒక్కసారిగా దూకాడు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన ఎయిర్‌ కూషన్‌(గాలితో నింపిన మెత్తని పరుపులాంటిది) పైన పడ్డాడు. దీంతో ఆ వ్యక్తి గాయాలు కూడా కాకుండా బతికి బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దినికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

English summary

A man jumps from the 11 floors of the building. A man in China jumps from the 11 floors top of the building. But even he didn't injured.