అత్యాచారయత్నాన్ని అడ్డుకుందని.. బాలికను కత్తితో పొడిచి...

A man killed a girl for she is rejecting rape

03:05 PM ON 28th September, 2016 By Mirchi Vilas

A man killed a girl for she is rejecting rape

అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే ఆగ్రహంతో ఓ బాలికను కిరాతకంగా కత్తితో పొడిచిన యువకుడి ఉదంతం న్యూఢిల్లీ నగర శివార్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బారాబంకీలోని రాంసానేహి ఘాట్ ప్రాంతంలోని పొలంలో 14 ఏళ్ల ఓ బాలిక ఒంటరిగా పనిచేస్తుండగా రంజిత్ అనే యువకుడు చూశాడు. ఆ బాలికను పొదల్లోకి లాక్కెళ్లి యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె గట్టిగా ప్రతిఘటించింది. అంతే తనను అడ్డుకుందనే కోపంతో రంజిత్ కత్తితో బాలికను కర్కశంగా పొడిచాడు. బాలిక పెట్టిన కేకలు విన్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వచ్చి నింధితుడు రంజిత్ ను కొట్టి అతన్ని పోలీసులకు అప్పగించారు.

తీవ్రంగా కత్తిపోట్లకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాలిక పరిస్థితి మెరుగుపడి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

A man killed a girl for she is rejecting rape