కొత్త నోట్ల కోసం ఫ్రెండ్ ని చంపేసి తగులబెట్టారు

A Man Killed And Burnt For New Notes

06:14 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

A Man Killed And Burnt For New Notes

ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా. అంతేకాదు, డబ్బు ముందు అన్నీ దిగదుడుపే అన్నట్లు ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. ఇక స్వార్థం ముందు స్నేహానికి విలువ శూన్యమైపోతోంది. చివరికి అనేక సంవత్సరాలు కలిసి ఉన్నవాళ్ళు కూడా డబ్బు కోసం మిత్రుడి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడటం లేదు. కర్ణాటకలోని తెంగినకళ్ళు అటవీ ప్రాంతంలో జరిగిన సంఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

చన్నపట్న సమీపంలోని కళానగర్ కు చెందిన సత్తార్ అలీ, అల్తాఫ్, మొహైబ్, సయ్యద్, అక్బర్ చాలా కాలం నుంచి పరిచయస్థులే. వీరిలో సత్తార్ అలీ వద్ద రూ.10 లక్షల విలువైన కొత్త రూ.2,000 నోట్లు ఉన్నాయి. మిగిలిన నలుగురు తమ వద్ద పాత నోట్లు ఉన్నాయని, 20 శాతం కమిషన్ ఇస్తామని, కొత్త నోట్లు ఇవ్వాలని సత్తార్ అలీని అడిగారు. సత్తార్ ను ఈ నెల 16న అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ సత్తార్ ను హత్య చేసి, శవాన్ని తగులబెట్టేశారు. కాలిన శవాన్ని ఈ నెల 18న కొందరు చూసి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే కాల్ డేటా ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు తాము నేరం చేసినట్లు అంగీకరించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

ఇది కూడా చూడండి: కొత్త నోట్ల.. ప్రింటింగ్ ఖర్చెంతో తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చూడండి: బుగ్గలు లేదా ముఖం మీద కొవ్వు తగ్గించుకోవటానికి వ్యాయామాలు

ఇది కూడా చూడండి: వాసెలిన్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసా?

English summary

A Man Killed And Burnt For New Notes near Bengaluru.