హత్య చేసి, ప్లాస్టిక్ సంచుల కింద మట్టితో కప్పి...

A man killed for money by his wife

09:48 AM ON 24th May, 2016 By Mirchi Vilas

A man killed for money by his wife

అక్రమ సంబంధాలు ప్రాణాల మీదికి తెస్తాయని తెల్సినా కొందరు అదే దారిలో వెళతారు. ఫలితం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? తాజాగా వివాహేతర సంబంధమే అతడి ప్రాణం తీసింది. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కుటుంబ సభ్యులను కాదనుకుని ఒక వివాహితతో పెట్టుకున్న సంబంధం చివరికి హత్యకు దారి తీసింది. గుంటూరు జిల్లా వినుకొండ కొండమెట్ల బజారులో ఓ ఇంటి ఖాళీ స్థలంలో మట్టి పోసి ప్లాస్టిక్ గోతాల కింద వెలుగు చూసిన మృత దేహం ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈపూరుకు చెందిన ఆటో డ్రైవర్ మొగలి హనుమంతరావు(35) గా గుర్తించారు.

ఈపూరు గ్రామానికి చెందిన లాజరు, ఆదెమ్మల కుమార్తె రాణికి శావల్యాపురం వేల్పూరు గ్రామానికి చెందిన మొగలి హనుమంతరావుతో 2004లో వివాహం అయింది. పెళ్ళి అయిన తర్వాతి నుంచి హనుమంతురావు కూడా ఈపూరు వచ్చి ఉంటున్నాడు. ఆటో నడుపుకొంటూ సంసారాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన వరకు హనుమంతరావుకు ఏ అలవాట్లు లేవని బంధువులు చెబుతున్నారు. అయితే రెండు సంవత్సరాలుగా అంగలూరు గ్రామానికి చెందిన ఒక వివాహితతో సంబంధం పెట్టుకొని ఆమెతో కలిసి వినుకొండలో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాణి రెండుసార్లు వినుకొండ వెళ్ళి ఈపూరులోని ఇంటికి రమ్మని ప్రాధేయపడినా హనుమంతరావు అంగీకరించలేదని బంధువుల కథనం.

ఈ క్రమంలో హనుమంతరావు గుంటూరులో తనకున్న స్థలాన్ని విక్రయించాడు. వచ్చిన డబ్బుల్లో కొంత అప్పులు తీర్చగా.. మిగిలిన డబ్బులు భార్యకు వెళ్తాయనే ఆలోచనతో డబ్బు కోసమే హనుమంతరావును హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళే హత్య చేయించి ఉంటుందని, అందుకే ఆమె కనిపించకుండా పోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A man killed for money by his wife