రెండో పెళ్లి సీక్రెట్ చెప్పేసాడని కత్తులతో పొడిచి , కాల్చేశారు

A Man Killed His Friend For Saying About His Second Marriage In Hyderabad

03:39 PM ON 24th May, 2016 By Mirchi Vilas

A Man Killed His Friend For Saying About His Second Marriage In Hyderabad

తన రెండో పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడన్న పగతోనే స్నేహితుడిని హత్య చేశాడట ఓ ప్రబుద్ధుడు. ఇందుకోసం కొంతమంది సాయం తీసుకున్నాడు కూడా. కత్తులతో పొడిచి, చంపేసి, శవాన్ని కాల్చేసారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తి అదృశ్యమై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు లో మిస్టరీని పోలీసులు చెందించి అసలు విషయం తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ (37)కి గోల్నాక అశోక్‌నగర్‌కు చెందిన ఫరీదాబేగం కుమార్తె సమీనా బేగంతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇస్మాయిల్‌ స్నేహితుడు షఫీఉల్లా అలియాస్‌ షపీ మధ్యవర్తిగా వ్యవహరించాడు. షఫీకి 2007లో ఫరీదాబేగంతో రెండో వివాహం జరిగింది. ఈ విషయం షఫీ తన మొదటి భార్య, కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. సమీనాకు గతంలోనే ఓ యువకుడి వివాహం జరిగి విడాకులైనట్లు, ఫపీకి తన అత్త ఫరీదాబేగంను రెండో వివాహం చేసుకున్నట్లు ఇస్మాయిల్‌కి తెలిసింది.

ఇవి కూడా చదవండి:తాగిన మత్తులో...భర్తను చంపేసిన భార్య

అప్పటి నుంచి షపీని ఇస్మాయిల్‌ అవమానించేవాడు. తన కుటుంబ వివాదాల్లో షఫీ జోక్యం చేసుకోవడాన్ని సహించలేదు. ఈనెల 12వ షఫీ ఇంటికి వెళ్లిన ఇస్మాయిల్‌ అతడి రెండో వివాహంపై కుటుంబసభ్యులకు తెలియజేశాడు. దీంతో ఇస్మాయిల్‌ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. 13వ తేదీ రాత్రి ఉమ్మడి స్నేహితుడైన బాగ్‌అంబర్‌పేటలోని నాసిర్‌ ఇంటికి పిలిచాడు. అక్కడికి చేరుకున్న ఇస్మాయిల్‌ని నాసిర్‌ ఇంటిబయటే షఫీ ఆపాడు. షఫీ, అతని స్నేహితడు అత్తాపూర్‌కు చెందిన షేక్‌ హమీద్‌పాషా కత్తులతో ఇస్మాయిల్‌ కడుపులో పొడవడంతో గట్టిగా అరచి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి అరుపులకు నాసిర్‌ ఇంటి నుంచి బయటికొచ్చాడు. నిందితులు ఇస్మాయిల్‌ శవాన్ని కారులో తీసుకుని కొంత దూరం వెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న మరో కారులో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పుర్‌ మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి కాల్చేశారు మృతదేహాన్ని తరలించడానికి షఫీకి మిత్రులైన మహ్మద్‌ఆరీఫ్‌, సయ్యద్‌ అబేద్‌, సయ్యద్‌ మగ్థుం, సయ్యద్‌ జైద్‌ ఆహ్మద్‌ సహకరించారు.

ఇవి కూడా చదవండి:రియల్ గజినీని ఎప్పుడైనా చూసారా.?

తమ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని తాటిపర్తి వాసులు భూత్పూర్‌ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. కుమారుడి అదృశ్యంపై ఇస్మాయిల్‌ తల్లి షఫీపై అనుమానంతో అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పటికే ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అది ఇస్మాయిల్‌దేనని నిర్ధారించుకున్నారు. అంబర్‌పేట పోలీసులు షఫీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా ఇస్మాయిల్‌ని హత్య చేసినట్లు అంగీకరించాడు. షఫీకి సహకరించిన షేక్‌ హమీద్‌పాషా, మహ్మద్‌ ఆరీఫ్‌, సయ్యద్‌ అబేద్‌, సయ్యద్‌ మగ్ధుం, మహ్మద్‌ జైద్‌ ఆహ్మద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ఒక కత్తి, మూడు సెల్‌ఫోన్లు, ఒక వ్యాగనార్‌ కార్‌ (ఏపీ11ఎబి 4076) స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఇస్మాయిల్‌ హత్య తన ఇంటి సమీపంలో జరిగిన నాసిర్‌ ఈ విషయాన్ని పోలీసులు తెలపలేదు. నాసీర్‌ ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు కావడంతో అతడిని కేసు నుంచి పోలీసులు తప్పించారనే విమర్శలున్నాయి.

ఇవి కూడా చదవండి:లోయలో పడ్డ బస్సు.. పూరీ యాత్రలో విషాదం

English summary

A Man Named Shafee was killed his friend Ismayil for saying the secret about his second marriage in Amberpet in Hyderabad.