తల్లిని చంపి కూతుర్ని రేప్ చేసిన కసాయి

A Man Killed Mother And Raped Her Daughter

12:59 PM ON 21st April, 2016 By Mirchi Vilas

A Man Killed Mother And Raped Her Daughter

తల్లిని చంపి కూతురిని రేప్ చేసిన దారుణమైన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది . అక్రమ సంబంధాలు ఎంతటి చెడుని కలిగిస్తాయో చాటి చెప్పిన ఘటన ఇది . ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని కొత్తపల్లి మండలం న్యామద్దుల గ్రామానికి చెందినా మాభున్ని అనే 40 ఏళ్ళ వయసున్న మహిళ అనంతపురానికి చెందిన రామకృష్ణతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి :పార్టీ కోసం టీవీ ఛానల్ పెట్టనున్న పవన్ కళ్యాణ్!

ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు . మాభున్ని పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుండగా , రెండో కుమార్తె టెన్త్ చదువుతోంది . రామకృష్ణతోనే ఉంటున్న వారిని రామకృష్ణ అనంతపురంలోని శారదానగర్ లోని ఒక ఇంట్లో పెట్టాడు . ఇటీవల వారిని అనంతపురంలోని అశోక్ నగర్ కు మార్చిన రామకృష్ణ కన్ను మాభున్ని పెద్ద కూతురి పై పడింది . దీంతో ఎలా అయినా మాభున్ని పెద్ద కూతురిని దక్కించుకోవాలనుకున్న రామకృష్ణ పోయిన గురువారం నాడు మాభున్ని ని అతికిరాతకంగా హతమార్చి ఆమె ఇద్దరు కుమార్తెలను తీసుకుని హిందూపురం వెళ్ళిపోయాడు.

ఇవి కూడా చదవండి :ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

హిందూపురంలోని లాడ్జ్ లో మాభున్ని పెద్ద కూతురి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు . మాభున్ని హత్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రామకృష్ణ ఉంటున్న ఆ లాడ్జి పై దాడి చేసి రామకృష్ణను అరెస్ట్ చేసి , ఆ బాధితురాలిని అనంతపురం హాస్పిటల్ కు తరలించారు . రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా మాభున్ని ని తానే హతమార్చానని ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి :పవన్ గురించి స్టూడెంట్స్ అలా అన్నారేంటి?(వీడియో)

మాభున్ని రెండో కుమార్తె మాత్రం ఈ ఘటన జరిగినప్పటి నుండి మాభున్ని రెండో కుమార్తె అదృశ్యం అయ్యింది . దీని పై రామకృష్ణ ను అడగగా సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు వెల్లడించారు . రామకృష్ణ పై కేసులు నమోదు చేసి , మాభున్ని రెండో కుమార్తె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

ఇవి కూడా చదవండి :కెసిఆర్ ని ఆహ్వానించిన బాలయ్య

English summary

A Man Named Ramakrishna killed woman named Mabhunni and Reped her daughter in Ananthapuram District. Police Arrested accused person named Ramakrishna and takem him into their custody.