కూతుర్ని నేలకేసి కొట్టి.. భార్యను హతమార్చి..ఆపై కాల్చేసాడు

A Man Kills His Wife And Daughter In Medak

01:03 PM ON 30th May, 2016 By Mirchi Vilas

A Man Kills His Wife And Daughter In Medak

కన్న కూతురిని నేలకేసి కొట్టి, కట్టుకున్న భార్యనూ దారుణంగా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాలను ఆ దుర్మార్గుడు కాల్చేసాడు. పోలీసుల కధనం ప్రకారం.. మెదక్ మండల పరిధిలోని చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ(22)ను కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన చింతాకుల ఎల్లంతో నాలుగేళ్ల క్రితం ఐదు లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. వ్యవసాయపనులు చేసుకుంటూ జీవిస్తున్న ఎల్లం, ఎల్లవ్వ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. శనివారం ఉపాధి పనుల్లోకి వెళ్లిన ఎల్లవ్వ ఇంటికొచ్చాక అత్త లక్ష్మి, భర్త ఎల్లంతో గొడవపడగా మాటామాటా పెరిగిపోయింది. దీంతో ఇంట్లోనుంచి కూతురు శృతిని తీసుకుని ఎల్లవ్వ బయటకెళ్లిపోయింది. ఎల్లవ్వ కోసం భర్త వెతుకుతూ వెతుకుతూ చేగుంట గ్రామ శివారులో పొలంవద్ద వారిని చూశాడు. అక్కడ కూడా ఇద్దరిమధ్య మాటామాటా పెరిగింది. వాదన తారాస్థాయికి చేరడంతో కోపంతో ఊగిపోతూ, కూతురిని నేలకేసి కొట్టి అతి దారుణంగా చంపేశాడు.

అడ్డొచ్చిన భార్యను కూడా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే ఉన్న పొదల్లోని కట్టెలను వారిపై పేర్చి కాల్చేసాడు. తిరిగి కర్నాల్పల్లికి చేరుకున్న ఆ దుర్మార్గుడు ఏమీ తెలియనట్టు , ఎల్లవ్వ ఆచూకీ కోసం అందరినీ అడగడం మొదలుపెట్టాడు. చివరకు రాత్రి 10 గంటల సమయంంలో చేగుంట పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భార్య ఎల్లవ్వ, కూతురు శృతి తగులబెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు కంపైంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన మృతదేహాలను పరిశీలించారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రే మెదక్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అయితే ఆదివారం ఉదయం తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, రామాయంపేట సీఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్రెడ్డితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వారిద్దరిదీ ఆత్మహత్యకాదని, హత్యేనని నిర్ధారించుకున్నారు. చేగుంట తహసీల్దార్ నిర్మల మెదక్ ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. చిట్టోజిపల్లి నుంచి 200 మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా పోలీసులు వారిని సముదాయించారు. వరకట్నం కోసమే తన కూతురు, మనవరాలిని హత్యచేశారని మృతురాలి తల్లి పెంటమ్మ, అన్న మహేష్లు రోదిస్తూ పోలీసులకు మొరపెట్టుకున్నారు. నిందితుడు ఎల్లంను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ మేరకు 302 సెక్షన్ కింద ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:టాయ్‌లెట్‌కు వెళ్తే, పురుషాంగం పై కాటేసిన పైథాన్

ఇవి కూడా చదవండి:తుపాకీతో కాల్చేసుకున్న మాజీ సీఎం మనవడు

English summary

A Man Named Ellam in Medak District was killed his wife Yelamma and his daughter and later he burned them in near by bushes .The complaint has been filed on that accused person and later police arrested him and taken him into custody.