పాములు బాబోయ్ పాములు... గుండె జలదరించే ఘటన(వీడియో)

A man left 285 snakes into forest

11:48 AM ON 15th October, 2016 By Mirchi Vilas

A man left 285 snakes into forest

అదిగో పామంటే, అల్లంత దూరం పారిపోతాం. ఇక పొరపాటున పాముని చూస్తే, ఏమైనా అవుతుందా అని మదన పడిపోతుంటారు. అలాంటిది మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన సలీమ్ ఖాన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 285 పాములను మూటగట్టుకుని అడవిలోకి వదిలేశాడు. ఆ సమయంలో ఏ మాత్రం బెరుకు గానీ, భయం గానీ అతని కళ్లలో కనిపించలేదు. సలీమ్ పాములు పడుతూ, మనుషుల నుంచి వాటిని, వాటి బారి నుంచి మనుషులను కాపాడుతూ ఉంటాడు. అయితే ఇలా పాములను అడవిలోకి వదులుతున్న సమయంలో తీసిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియో చూస్తే ఔరా అనకుండా ఉండలేరు. గుండె జలదరించే ఈ వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

A man left 285 snakes into forest