అది గెడ్డం... కాదు కాదు.. తేనే తుట్టె

A man made his Beard as Honey Hive

11:19 AM ON 17th December, 2016 By Mirchi Vilas

A man made his Beard as Honey Hive

కొందరు ఎక్కువ జుట్టు పెంచుతారు. కొందరు గోళ్లు పెంచుతారు. ఇంకొందరు వెరైటీగా గెడ్డం పెంచుతారు. ఇలా ఈ లోకంలో ఎన్నో వింతలు. ఈ వింతల్లో ఇది కూడా ఒకటి. అతని గెడ్డం తేనే తుట్టగా మార్చేశాడు. మనం ఒక్క తేనెటీగ దగ్గరకు వస్తేనే వణికిపోతాం. తేనెటీగ కుడితే ఆ నొప్పి భరించలేం. ప్రకృతితో స్నేహం చేస్తూ జీవించే వాటికి ఏదైనా హాని తలపెడితేనే తిరగబడతాయి. ఆ విషయాన్ని నిరూపించడం కోసం ఓ వ్యక్తి తన గడ్డాన్నే తేనెతుట్టగా మలిచి తేనెటీగలకు నివాసంగా చేసేసాడు.

సాధారణంగా ఆడ తేనెటీగలు ఎప్పుడూ తుట్ట దగ్గరే ఉంటాయి. మగ ఈగలే తిరుగుతూ మకరందాన్ని సేకరిస్తాయి. ఈజిప్టుకు చెందిన మహ్మద్ హగ్రస్ తన గడ్డంపై ఆడ తేనెటీగల హార్మోన్లను పూసుకొని మగ తేనెటీగల్ని ఆకర్షిస్తూ, ఆ తేనెటీగలను గడ్డం మీదనే పెంచుతున్నాడు. అన్ని ఈగలు గడ్డంపై వాలుతున్నా.. అతన్ని మాత్రం ఒక్కటి కూడా కుట్టవు.

‘‘మనం వాటికి హాని కలిగిస్తేనే అవి ప్రతిదాడి చేస్తాయి. అంతేతప్ప తేనెటీగలను చూసి భయపడాల్సిన అవసరం లేదు’’ అని చెబుతున్నాడు ఈ ప్రకృతి ప్రేమికుడు.

గడ్డంపై తేనె తుట్ట పెట్టి అందులో తేనెను దాచుకుంటున్న ఈగలు అతని శరీరంపై కూడా సేదతీరుతాయి.

ఈజిప్టు ప్రజలకు తేనెటీగలపై అవగాహన కల్పిస్తూ.. జీవజాతి మనుగడకు ఇవి ఎంత ఉపయోగకరమో.. ఆహారోత్పత్తి ప్రక్రియలో వాటి పాత్ర ఎంతో కీలకమంటూ హగ్రస్ ప్రచారం చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

English summary

A man in Egypt made his beard as Bee Hive. He used female bees hormones to attract male bees. It is really a miracle who treated Nature as friend and living with honey Bee Hive.