అబ్బాయే అమ్మాయి వేషం వేసుకుని 11 మందిని పెళ్లి చేసుకున్నాడు!

A man married 11 boys

11:01 AM ON 11th June, 2016 By Mirchi Vilas

A man married 11 boys

ఎవరైనా ఒక పెళ్లి చేసుకుంటారు. లేకపోతే రెండు... అదీ సెట్ కాకపోతే మూడు. అయితే ఒక ఆమె ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. ఆమె కాదు.. ఆమె రూపంలో ఉన్న అతను.. అంటే బృహన్నల కానే కాదు... ఇదో ఆకతాయి వ్యవహారంలా ఉందా? ఆ వివరాల్లోకి వెళితే.. సొంగాటో(27) అనే ఓ పురుషుడున్నాడు. అమ్మాయి వేషం ధరించి 11 మందిని బోల్తా కొట్టించాడంటే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా ఈడో రకం... సొంగాటో నిత్యం అమ్మాయిలా అందంగా ముస్తాబై ఆన్ లైన్ లో ఛాటింగ్ కు వచ్చి.. రకరకాల పేర్లతో ఛాటింగ్ చేసే సొంగాటో ప్రొఫైల్ బాగున్న(అందంగా) అబ్బాయిలను ఆడగొంతుతో మాయచేసేవాడు.

కేవలం వెబ్ ఛాట్ ద్వారా వారిని పెళ్లి పీటలు ఎక్కించాడు. అలా ఏడాదిలో 11 మంది బాయ్ ఫ్రెండ్ లను ఆడవేషంలో పెళ్లి చేసుకున్నాడంటే ఎంత చాకచక్యంగా మోసం చేశాడో అనుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు జాగ్రత్తగా మెయింటైన్ చేసే సొంగాటో మూడో రోజు గిఫ్టులు, పెళ్లి వారింట్లో డబ్బులు పట్టుకుని మెల్లిగా జంప్ అయ్యేవాడు. అయితే 11వ బాయ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమ్మాయిలాగా వివాహంలో దర్శనమిచ్చిన సొంగాటో అసలు రంగు బట్ట బయలు అయింది. తాను పురుషుడ్ని పెళ్లి చేసుకున్నానని తెలిసిన పెళ్లి కొడుకుకి దిమ్మ తిరిగిపోయింది.

తీరా తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి సొంగాటో ఇంటి పై పోలీసులు, దాడి చేసిన పెద్ద ఎత్తున స్త్రీలు ఉపయోగించే దుస్తులు, మేకప్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారట. అయినా ఈరోజుల్లో ఇంతలా మోసపోయే అబ్బాయిలున్నారా?

English summary

A man married 11 boys