పాముతో పెళ్లి... అంతేకాదు కాపురం కూడా..!

A man married a snake in Thailand

11:24 AM ON 14th November, 2016 By Mirchi Vilas

A man married a snake in Thailand

నిజానికి మనకున్న నమ్మకాలు, విశ్వాసాలు అన్నీ ఇన్నీ కాదు. ఇవి కొన్ని మూఢ నమ్మకాలుగా మారిపోయాయి కూడా. ఇక నమ్మకాలు, విశ్వాసం... మనుషులను ఎంతలా భ్రమింపజేస్తాయో చెప్పడానికి ఇది ప్రబల నిదర్శనం. ఎందుకంటే, మనిషి పామును పెళ్లి చేసుకున్నాడని అంటేనే ఖంగు తింటాం. ఇక దాంతో హానీమూన్ ప్లాన్ చేసుకుంటే, ఒళ్ళు జలదరిస్తుంది. అయితే, థాయ్ లాండ్ కు చెందిన వొర్రానన్ అనే వ్యక్తి మాత్రం చనిపోయిన ప్రేయసి పాము రూపంలో జన్మించిందన్న విపరీతమైన విశ్వాసంతో ఏకంగా పామునే పెళ్లి చేసుకున్నాడు.

1/3 Pages

అంతేకాదు ప్రస్తుతం పదడుగుల ఆ కోబ్రాతో వొర్రానన్ కాపురం కూడా చేస్తున్నాడు. ఇక ఎక్కడికెళ్లినా, కోబ్రాను వెంటబెట్టుకునే వెళ్తాడు. కోబ్రాను పక్కనుంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని ఎవరైనా హెచ్చరిస్తే, ఆ వ్యాఖ్యలను అతగాడు కొట్టిపారేస్తాడు. తన భార్యే పాము రూపంలో పునర్జమ్మ ఎత్తి తనకు దగ్గరైందని బలంగా విశ్వసించే ఇతగాడు ఈమధ్యే పాముతో పాటు సింగపూర్ లో హనీమూన్ కు కూడా వెళ్లొచ్చాడట.

English summary

A man married a snake in Thailand