సింగర్ ని కిరాతకంగా కాల్చేసి.. ఆ పై తానూ కాల్చుకుని..

A man murdered a singer in US

11:56 AM ON 13th June, 2016 By Mirchi Vilas

A man murdered a singer in US

అమెరికాలోని ఓర్లాండోలో దారుణం జరిగిపోయింది. 22 ఏళ్ళ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీని ఓ యువకుడు కిరాతకంగా ఆమె కణత పై గన్ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. రాత్రి పది గంటల సమయంలో క్రిస్టినా పాటలు పాడుతూ ఓ దశలో తన అభిమానికి ఆటోగ్రాఫ్ ఇస్తుండగా.. కెవిన్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్రిస్టినా ఆ తర్వాత మరణించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ క్లబ్ లో 60 మంది నుంచి వందమంది వరకూ ఉన్నారని పోలీసులు చెప్పారు. క్రిస్టినా సోదరుడు చాలామందిని వెంటనే బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

క్రిస్టినా మృతితో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం కెవిన్ తాను కూడా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ కన్సర్ట్ లైవ్ షోగా సాగుతుండగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ది వాయిస్ అనే పాటతో పాపులర్ అయిన క్రిస్టినాను మర్డర్ చేస్తున్నందుకు సారీ చెబుతున్నానంటూ ఘటనా స్థలంలో కెవిన్ రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. అతడ్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ హత్యకు కారణాలేమిటో తెలియడంలేదని, క్రిస్టినాకు కెవిన్ బాయ్ ఫ్రెండ్ కాదని పోలీసులు అంటున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

English summary

A man murdered a singer in US